Manchu Vishnu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కుటుంబ కలహాలతో వార్తల్లో నిలుస్తున్న కుటుంబం మంచు ఫ్యామిలీ (Manchu Family) అని చెప్పవచ్చు. ముఖ్యంగా మంచు మనోజ్(Manchu Manoj) రెండో వివాహం చేసుకున్న తర్వాతనే అసలు గొడవలు బయటపడ్డాయని చాలామంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్తుల కోసమే గతంలో మంచు మనోజ్, మంచు విష్ణు (Manchu Vishnu) గొడవపడ్డారని, ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే తన తండ్రితో ఒకే ఇంట్లో కలిసి ఉన్న మనోజ్ ఆస్తి కోసమే గొడవ పడ్డారంటూ చాలామంది పలు రకాల కామెంట్లు చేశారు. ఇదే విషయంపై మంచు మనోజ్ మాట్లాడుతూ.. తాను ఆస్తి కోసం గొడవ పడడం లేదని, మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో అడగడం వల్లే తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.
జనరేటర్ లో చక్కెర పోయడంపై విష్ణు క్లారిటీ..
దీనికి తోడు ఇటీవల సంక్రాంతి సందర్భంగా తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మనోజ్, మోహన్ బాబు వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. ఇక ఒక విషయం తర్వాత మరొకటి మంచు కుటుంబీకులలో మనశ్శాంతి లేకుండా చేస్తోందని వార్తలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా కన్నప్ప సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు ఛానెల్స్ ఇంటర్వ్యూ ఇస్తున్న మంచు విష్ణు.. జనరేటర్ లో చక్కెర పోయడం పై క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా జనరేటర్ లో చక్కెర పోసి చంపాలని మీరు ప్రయత్నించారట కదా.. నిజమేనా? అని ప్రశ్నించగా.. విష్ణు మాట్లాడుతూ.. “జనరేటర్ లో చక్కెర, ఉప్పు, నీరు పోస్తే ఫిల్టరింగ్ ప్రాసెస్ అవుతుంది. కానీ పేలడాలు లాంటివి జరగవు. ఇది అతి పెద్ద జోక్” అంటూ నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కుటుంబంలో గొడవలు చల్లారేదెప్పుడు..
ఇదిలా ఉండగా గత ఏడాది మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తతలో మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉండగా ఈ సమస్య సద్దుమణిగింది అని అందరూ అనుకున్నారు. ఇక అందులో భాగంగానే మోహన్ బాబు భార్య నిర్మలా దేవి పుట్టినరోజు కాగా , ఆ రోజు మంచు విష్ణు తన ఇంటికి వచ్చి ఆమె చేత కేక్ కట్ చేయించి, ఆమెతో కాసేపు గడిపి వెళ్లిపోయారట. కానీ మనోజ్ మాత్రం జనరేటర్ లో మంచు విష్ణు చక్కర పోసి మమ్మల్ని చంపాలని ప్లాన్ చేశాడు అంటూ మళ్ళీ విష్ణు పై కంప్లైంట్ ఇచ్చారు. ఆ మరుసటి రోజు మంచు మనోజ్ తల్లి నిర్మల.. మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అని, విష్ణు నా దగ్గరకు వచ్చి నాతో కేక్ కట్ చేయించి, ఆ తర్వాత నాతో కొద్దిసేపు సరదాగా గడిపి తన రూమ్ లో ఉన్న వస్తువులను తీసుకెళ్లిపోయాడని మాత్రమే చెబుతూ ఒక స్టేట్మెంట్ను పోలీసులకు అందజేసింది. అయితే మనోజ్ అదే సమయంలో ఆళ్లగడ్డకు వెళ్లడంతో ఇదంతా జరిగింది. ఇక తర్వాత మంచు మనోజ్ తన తల్లి బ్రెయిన్ వాష్ చేసి తనపై ఇలా వ్యతిరేకంగా కంప్లైంట్ ఇప్పించాడు తన అన్న అంటూ కూడా కామెంట్లు చేశారు