Crime News: వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోల్ కతాలోని గంగానదిలో సూట్ కేసులో మూటగట్టిన మృతదేహాన్ని పారవేసేందుకు ప్రయత్నించిన తల్లీ కూతుళ్లను స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మహిళలను ఫల్గుణి ఘోష్, ఆరతి ఘోష్ గా పోలీసులు గుర్తించారు.
ALSO READ: UPSC Recruitment: గోల్డెన్ ఛాన్స్.. యూపీఎస్సీలో 752 ఉన్నత ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు భయ్యా..
వివరాల ప్రకారం.. నార్త్ కోల్‌కత్తాలోని కుమార్తులిలోని గంగా నది తీర సమీపంలో ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో నీలిరంగు సూట్ కేసుతో స్థానికులకు ఇద్దరు మహిళలు కనిపించారు. ఈ ఇద్దరు మహిళలను గమనించిన స్థానికులు వారి అనుమానాస్పద కదలికలను గుర్తించారు. ఆ సూట్ కేసులో ఏముందని వారిని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సూట్ కేసులో తమ పెంపుడు కుక్క అవశేషాలు ఉన్నట్లు వారు చెప్పారు.
దీంతో స్థానికులకు వారిపై మరింత అనుమానం వచ్చింది. తాము ఇద్దరు మహిళలను సూట్ కేసులో ఏముందని ప్రశ్నించగా.. కుక్క అవశేషాలు ఉన్నట్లు చెప్పారని స్థానికులు పేర్కొన్నారు. అయితే సూట్ కేసును వారు ఓపెన్ చేయకపోవడంతో తమకు మరింత అనుమానం కలిగిందని స్థానికులు పేర్కొన్నారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్ కేసులో తీవ్ర రక్తంతో కూడిన మృతదేహాన్ని గుర్తించారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతురాలిని సుమితగా గుర్తించారు.
పోలీసులు వివరాల ప్రకారం.. మృతురాలు సుమిత, పల్గుణి మామ సోదరి అని తెలిపారు. అస్పాంలోని జోర్హాట్ కు చెందిన సుమిత తన భర్త నుంచి విడిపోయి ఫిబ్రవరి 11 నుంచి కోల్ కత్తా నివాసరంలోని తల్లి, కూతుళ్లతో ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ఫల్లుణితో జరిగిన తీవ్ర వాగ్వాదంలో సుమిత చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ‘ఫల్గుణి తన భర్తతో విబేధాలు ఉండడంతో.. గత కొన్ని రోజులుగా విడిగా ఉంటుంది. ఏదో కారణం చేత నిన్న సాయంత్రం 4 గంటలకు సుమిత, పల్గుణి మధ్య గొడవ జరిగింది. గొడవ తీవ్రతరం కావడంతో ఫల్గుణిని గోడకు నెట్టింది. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె స్పృహాలోకి వచ్చాక మళ్లీ ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో ఫల్గుణి, ఆమె ముఖం, మెడపై ఇటుకతో బలంగా బాదడంతో సుమిత మృతిచెందిందని పోలీసులు అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: SBI Recruitment: శుభవార్త.. SBIలో 1194 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!
తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి సుమిత మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి నదిలో పారవేసేందుకు ప్రయత్నించారని.. పోలీసులు గుర్తించారు. నార్త్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలకత్తా మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ కేసును బరాసత్ జిల్లా పోలీసులకు బదిలీ చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.