Watch Video : మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ప్రయాణికులతో వెళుతున్న బస్సు తిరగబడిన ఘటనలో 38 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికుల్లో 6గురు తీవ్రంగా గాయపడినట్లుగా గుర్తించారు. హైవేపై రోడ్డు దాటేందుంకు ప్రయత్నించిన ఓ ద్విచక్ర వాహనదారున్ని తప్పించే క్రమంలో డివైడర్ ఎక్కిన బస్సు తిరగలపడింది. ఈ దృశ్యాలు హైవే మీద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ప్రమాద విషయం తెలిసి స్పాట్ కు చేరుకున్న పోలీసులు గాయపడిన వాళ్లకు వైద్యశాలకు తరలిస్తున్నారు.
మహారాష్ట్రలోనిని నాగ్ పూర్ – రత్నగిరి హైవేపై మధ్యాహ్నం బస్సు ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. వారు వెల్లడించిన విషయాల మేరకు ఈ హైవేపై వేగంగా వస్తున్న బస్సును చూసుకోకుండా..
చకూర్ తహసీల్‌లోని నందగావ్ పాటి సమీపంలో ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డును దాటేందుకు ప్రయత్నింటాడు. అహ్మద్‌పూర్ నుండి లాతూర్‌కు వెళుతున్న బస్సు హైవేపై కాస్త వేగంగానే వస్తుంది. అప్పటి వరకు సజావుగానే వెళ్లిన బైకర్, ఒక్కదారిగా చేతులు అడ్డం పెట్టి.. యూటర్న తీసుకునేందుకు ప్రయత్నించడంతో.. బస్సుకు ఎదురుగా వచ్చేశాడు. అతన్ని గుద్దేస్తుంది అనుకున్న సమయానికి.. బస్సు డ్రైవర్, బస్సును పక్కకు తిప్పేశాడు.
ఈ ప్రమాదంలో బైకర్ ను కాపాడేందుకు ప్రయత్నించిన బస్సు డ్రైవర్.. బస్సును తిప్పగానే దాని ముందు చక్రాలు ఓ వైపు డివైడర్ ఎక్కడంతో బస్సు ఓ పక్కకు ఒరిగిపోయింది. కాస్త ేగంగానే ఉండడంతో, బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో.. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా సంస్థ (MSRTC) బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. నాగ్‌పూర్-రత్నగిరి హైవేపై ఈ ప్రమాదం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసుల వెల్లడించారు. ఈ సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో దాదాపు 38 మంది ప్రయాణికులు గాయపడ్డారని డివిజనల్ ట్రాఫిక్ అధికారి సందీప్ పద్వాల్ మీడియాకు వెల్లడించారు.
ప్రయాణికులందరినీ ఆసుపత్రికి తరలించగా, వారిలో ఆరుగురు పరిస్థితిత విషమంగా ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు. గాయపడిన వాళ్లల్లో పరీక్షలకు వెళ్తున్న మహిళలు, విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు.
🚨 Bizarre Accident! 🚨
An Maharashtra Roadways bus overturned near Nandgaon Pati on the Nanded-Latur NH, about 14 km from Chakur (Latur), while avoiding a motorcycle. 38 passengers injured, 6 seriously!
A stark reminder of how reckless driving can turn deadly. #RoadSafety… pic.twitter.com/J5R70JBq2T— karan darda (@karandarda) March 3, 2025
హైవేపై బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తూ వేగం కోల్పోయిందని, ఆ తర్వాతే బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే రంగంలోకి హైవే భద్రతా అధికారులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. చాలా మది ప్రణాణికుల అంతర్గత అవయవాలకు దెబ్బ తగిలినట్లుగా వైద్యులు తెలుపుతున్నారు. అలాంటి వారిని అంబులెన్స్‌లు, ప్రైవేట్ వాహనాలలో ఆసుపత్రులకు తరలించారు.
Also Read :Intermediate Exam Tips: పరీక్షల్లో మంచి మార్కుల కోసం ఇవి పాటించండి.. సక్సెస్ మీదే..