Telangana Intermediate Exam Tips: రేపటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే విద్యార్థులు పరీక్షలకు సమయం దగ్గరవుతోన్న కొద్ది కాస్త ఒత్తిడికి గురవుతుంటారు. ఏడాది అంతా చదివాం.. అనుకున్నన్నీ మార్కులు వస్తాయో.. రావో లోలోన కొంచెం టెన్షన్ కు లోనవుతుంటారు. కొంత మంది విద్యార్థులు అయితే భయపడుతుంటారు. ఇలాంటి సమయంలోనే స్టూడెంట్స్ ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా జాబ్స్.. అప్లై చేశారా..? ఇంకా వారం రోజులే భయ్యా..!
నిద్ర చాలా ముఖ్యం..
ఇలాంటి సమయంలో స్టూడెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి స్ట్రగుల్ కి గురికాకుండా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ముందు రోజు మంచి నిద్రపోవడం మంచి ముఖ్యం. మంచి నిద్రిస్తే ఎగ్జామ్ లో యాక్టివ్ గా ఉండి ఎగ్జామ్ బాగా రాసే అవకాశం ఉంటుంది. కొంత మంది స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ ను చూడగానే ఆందోళనకు గురవుతుంటారు. ఆందోళనలో వచ్చిన సమాధానాలు కూడా మరిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ కఠినంగా.. అర్థం కాకుండా అడుగుతారు. దానికి సమాధానం తెలిసినప్పటికీ మీరు ప్రశ్న డిఫరెంట్ విధానంలో అడిగేసరికి టెన్షన్ పడుతుంటారు. అలాంటప్పుడు ఎక్కువ టెన్షన్ పడకుండా ప్రశ్నను మరోసారి చదవాలి. ఒత్తిడి గురి అవ్వడం వల్ల చదివిన అంశాలు మరిచిపోయేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది.
టెన్షన్ కు గురికాకుండా ఇలా చేయండి..
☀ మంచి మార్కులు పొందెందుకు సెలబస్ ను పూర్తి స్థాయిలో చదవాలి.
☀ ఎగ్జామ్ లో ఏ ప్రశ్నలకు ఎంత సమయం కేటాయించాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సమయాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి దృష్టి సారించాలి.
☀ ఎగ్జామ్ హాల్ కి వెళ్లాక బయటి విషయాల గురించి ఆలోచించకుండా కేవలం క్వశ్చన్ పేపర్ పై మాత్రమే ఫోకస్ చేయాలి
☀ ఏకాగ్రత కోల్పోయినట్లయితే ఒక్కసారి గ్లాస్ వాటర్ తాగి.. ప్రశాంతంగా శ్వాస తీసుకోవాలి.
☀ సానుకూల ఆలోచనతో టెన్షన్ కు గురికావొద్దు. ఎగ్జామ్ హాల్ లో ప్రశాంతంగా ఉండాలి.
☀ స్టూడెంట్స్ ఫోకస్ అంతా క్వశ్చన్ పేపర్ పై మాత్రమే ఉండాలి.
చదివిన వాటినే మళ్లీ రివిజన్ చేయండి..
☀ పరీక్షలకు ముందు కొత్త అంశాలను, కొత్త పుస్తకాలను అసలు ముట్టుకోవద్దు. మీరు చదివిన పాత పుస్తకాలనే నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి.
☀ గతంలో మీరు తయారు చేసుకున్న నోట్స్ నే రివిజన్ చేయాలి.
☀ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ముఖ్యమైన సూత్రాలను మాత్రమే ఎగ్జామ్ ముందు రోజు చదవాలి.
☀ ఎగ్జామ్ కు రెండు రోజుల ముందే పెన్, పెన్సిల్, స్కేల్, హాల్ టికెట్, ఐడెంట్ కార్డు వంటి వస్తువులను రెడీ చేసుకోని ఉంచుకోవాలి.
☀ ఎగ్జామ్ ముందు రోజు రాత్రి చాలా సేపు చదవకూడదు. రాత్రి వేళ కనీసం 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
☀ ముందు రోజు అతిగా చదవడం వల్ల టెన్షన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.
☀ ఫుడ్ విషయానికి వస్తే తేలికైన పోషకాహారం తీసుకోవాలి. ఎక్కువ మసాలా కలిపన ఆమారం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
☀ఎగ్జామ్ కు ముందు రోజే మీ పేరెంట్స్ తో పరీక్ష హాల్ దగ్గరక వెళ్లండి.
☀ పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోండి.
☀ బాగా చదివాను.. మంచి స్కోర్ వస్తుంది.. అనే నమ్మకంతోనే పరీక్ష కేంద్రంలోకి వెళ్లండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.