E-Paper
Advertisement

Chiranjeevi : ఓటీటీ రైట్స్‌‌కి ఈ పరిస్థితేంటో… చిరుకు కూడా తప్పని తిప్పలు..

Chiranjeevi : ఓటీటీ రైట్స్‌‌కి ఈ పరిస్థితేంటో… చిరుకు కూడా తప్పని తిప్పలు..
Advertisement

Chiranjeevi : గతంలో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే… థియేటర్ వద్ద ఓ పండగ వాతావరణం ఉండేది. ఆ పండగ వాతావరణం కాస్త కరోనా దయ వల్ల అది కాస్త కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఎంత పెద్ద సినిమా వచ్చినా… ఎలాంటి సినిమా వచ్చినా… థియేటర్‌కి ఏం వెళ్తాం లే… నాలుగు వారాలు వెయిట్ చేస్తే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా… అప్పుడే చూద్ధాం అని అనుకున్నారు.

ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా మారిపోయాయి. ఓటీటీలోకి వచ్చినా… చూడటం లేదు. మరీ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే… 3 గంటలు కేటాయిస్తున్నారు. లేకపోతే… అసలు చూడటం లేదు. దీనికి తోడు… ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో కూడా సినిమాలు చూడటానికి ముందుకు రావడం లేదు.

Advertisement

ఈ ప్రభావం చిన్న, పెద్ద అని తేడా లేకుండా… ప్రతీ సినిమాపై చూపిస్తుంది. అలా… మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ ఎఫెక్ట్ తగిలింది. భారీ పాన్ ఇండియా మూవీగా వస్తున్నవిశ్వంభర ఓటీటీ రైట్స్ అమ్మడానికి నిర్మాతలు విశ్వ ప్రయాత్నలు చేస్తున్నారట.

రిలీజ్ డేట్ ఇదేనా..?

Advertisement

ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ విశ్వంభర మూవీని దాదాపు 200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్కే ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ మూవీ సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ, ఆ వీఎఫ్ఎక్స్ పనులే పూర్తి కాలేదని వాయిదా వేసుకున్నారు. ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

తప్పుకున్న నెట్‌ఫ్లిక్స్..?

అయితే… ఈ మూవీకి ఓటీటీ డీల్ ఇంకా జరగలేదట. నిజానికి ఓటీటీ డీల్ క్లోజ్ చేయడానికి విశ్వంభర మేకర్స్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. ముందుగా నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిపారు. భారీ బడ్జెట్, భారీ కాస్ట్ అండ్ క్రూ. అన్నింటి కంటే… మెగాస్టార్ చిరంజీవి మూవీ కాబట్టి… ఓటీటీ రైట్స్ కి మేకర్స్ సాధారం కంటే కాస్త ఎక్కవే డిమాండ్ చేస్తున్నారట. దీంతో విశ్వంభర ఓటీటీ రైట్స్ తీసుకునే రేసు నుంచి నెట్‌ఫ్లిక్స్ తప్పుకున్నట్టు సమాచారం.

రంగంలోకి జీ 5..?

నెట్‌ఫ్లిక్స్ తప్పుకోవడంతో… ఓటీటీ రైట్స్ కోసం జీ 5 రంగంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విశ్వంభర నిర్మాతలు యూవీ క్రియేషన్స్‌ – జీ 5 మధ్య ఓటీటీ రైట్స్ గురించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అన్ని కుదిరితే… విశ్వంభర ఓటీటీ రైట్స్ జీ 5కే దక్కొచ్చు.

ఈ మూవీకి మాత్రమే కాదు… 

ఓటీటీ రైట్స్ విషయంలో ఇబ్బందులు ఈ మూవీకే పరిమితం కాలేదు. భారీ బడ్జెట్‌తో వచ్చే దాదాపు అన్ని సినిమాలకూ ఇదే పరిస్థితి ఉంది. నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టాలంటనే ఆలోచిస్తున్నారు. భారీ బడ్జెట్ పెట్టిన తర్వాత థియేటర్స్ బిజినెస్ జరగకపోయినా.. కలెక్షన్లు పెద్దగా రాకపోయినా… నిర్మాతలను కాపేడిది ఓటీటీ రైట్సే. కాబట్టి… ఓటీటీ రైట్స్ కు నిర్మాతలకు ఎక్కువగా కోట్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నిర్వహకులతో నిర్మాతలకు చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి.

Related News

మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

అమాయక ఐస్‌క్రీమ్ మ్యాన్ వెనుక దాగివున్న డార్క్ సీక్రెట్… నిద్రను దూరం చేసే భయంకరమైన సైకో హర్రర్

సోదరుడి మృతదేహం కోసం అర్ధరాత్రి వచ్చిన వ్యక్తి… రాత్రంతా ఊపిరి బిగపట్టించే టెన్షన్… డార్క్ సస్పెన్స్ డ్రామా

క్రేజీ పోలీసుల పిచ్చి ప్లాన్‌లు… అడుగడుగునా పొట్టచెక్కలయ్యే కామెడీ

విశ్రాంతి కోసం స్పాకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్… కట్ చేస్తే ఫుల్ కామెడీ

మాజీ నేవీ సీల్‌కు మళ్లీ డేంజరస్ మిషన్… న్యూక్లియర్ కోడ్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం… హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

కొండల్లోని అద్భుతమైన మాయా చెట్టు… కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఫ్యాంటసీ అడ్వెంచర్

నగరాన్ని కాపాడిన సూపర్‌ హీరోనే నిందితుడు… మూడేళ్ల తర్వాత సరదా తీర్చేసిన యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×