BigTV English

CM : సీఎం కాన్వాయ్‌‌కు షాక్.. పెట్రోల్‌లో వాటర్ మిక్స్, ఆగిపోయిన 19 వెహికిల్స్

CM : సీఎం కాన్వాయ్‌‌కు షాక్.. పెట్రోల్‌లో వాటర్ మిక్స్, ఆగిపోయిన 19 వెహికిల్స్

CM : సీఎం కాన్వాయ్ అంటే ఎంత టైట్ సెక్యూరిటీ ఉండాలి. ప్రతీ చిన్న విషయాన్ని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి. వాహనాల పార్కింగ్ నుంచి సర్వీసింగ్ వరకు అంతా పకడ్బందీగా చేస్తారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. సంఘవిద్రోహ శక్తులు టార్గెట్ చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే, సీఎం సెక్యూరిటీతో పాటు కాన్వాయ్ వాహనాలకూ అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారు. కట్ చేస్తే…


ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో 19 వాహనాలు ఉన్నాయి. వాటికి డీజిల్ పోయించాలి. మామూలుగా అయితే ఇలాంటి పనులు ఎక్కడ పడితే అక్కడ చేయరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న బంకుల్లోనే ఇంధనం నింపుతారు. కానీ, అనుకోకుండా జరిగిందో.. అర్జెంట్ అవసరం పడిందో కానీ.. సీఎం కాన్వాయ్‌లోని 19 వెహికిల్స్‌ను ఓ ప్రైవేట్ బంక్‌కు డీజిల్ కోసం తీసుకెళ్లారు. ఆ కార్లను చూసి పెట్రోల్ బంక్ వర్కర్స్ మొదట భయపడ్డారు. ఎవరి కార్లు ఇవి అని అడిగాడు. ముఖ్యమంత్రి వాహనాలు అనగానే అదిరిపోయారు. ఆ తర్వాత సంబరపడ్డారు. తమ బంక్‌లో సీఎం కార్లకు డీజిల్ పోయించారని తెలిస్తే తమకు ఫుల్ పబ్లిసిటీ వస్తుందని అనుకున్నారు. ఆ కార్లతో కాసేపు సెల్ఫీలు దిగారు. రాచమర్యాదలతో వాళ్లు అడిగినంత డీజిల్ ఆ 19 కార్లలో నింపారు. ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది.

డీజిల్ కొట్టగానే.. ప్రాబ్లమ్స్ స్టార్ట్


డీజిల్ కొట్టించుకున్నాక కార్లు స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ అవ్వట్లేదు. ఎంతగా ట్రై చేసినా ఇంజిన్ ఆన్ కావట్లేదు. అదేంటి..? ఇప్పుడేగా కార్లు డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చింది.. అంతలోనే ఏమైంది? అని కంగారు పడ్డారు సీఎం కాన్వాయ్ డ్రైవర్లు. మొదట ఓ కారు స్టార్ట్ కాకపోవడంతో ఏమైందో అనుకున్నారు కానీ.. మిగిలిన కార్లు కూడా అలానే మొరాయించడంతో ఆ డ్రైవర్లు ఉలిక్కిపడ్డారు. ఒకటా రెండా.. ఏకంగా 19 కార్లు పెట్రోల్ బంకులోనే ఆగిపోయాయి. ఎంత కష్టపడినా అవి స్టార్ట్ కాలేదు. డ్రైవర్లు, పోలీసులు, బంక్ సిబ్బంది అంతా కలిసి సీఎం కాన్వాయ్ కార్లను తోసుకుంటూ పక్కకు జరిపారు. ఆ తర్వాత వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

డీజిల్‌లో వాటర్ మిక్స్

ఒకేసారి 19 కార్లు ఆగిపోవడం మామూలు విషయమా? అప్పటి వరకూ మంచిగా నడిచిన వాహనాలకు సడెన్‌గా ఏమైంది? అంటే, పెట్రోల్ బంకులోనే ఏదో జరిగింది? అదేంటో తెలుసుకోవాలని అనుకున్నారు. వాళ్లు పోసిన డీజిల్‌పై అనుమానం వచ్చింది. ఆ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లో టెస్ట్ చేయిస్తే అసలు సంగతి బయటపడింది. ఆ డీజిల్‌లో వాటర్ మిక్స్ చేశారని తేలింది. నీళ్లు కలిసిన కల్తీ ఇంధనంతో కార్లు అక్కడికక్కడే ఆగిపోయాయని తెలిసి అంతా షాక్ అయ్యారు. అందులోనూ అవి సీఎం కాన్వాయ్ వెహికిల్స్ కావడంతో యాక్షన్ మొదలైంది. బంక్‌ను సీజ్ చేశారు.

పెట్రోల్ బంక్ సీజ్

డీజిల్‌లో వాటర్ కలపడం ఏంటి? మరీ కక్కుర్తి కాకపోతే. కల్తీ చేయాలనే అనుకున్నా కిరోసిన్ గట్రా కలుపుతారు కానీ.. ఇలా నీళ్లు మిక్స్ చేస్తారా ఎవరైనా? అలా కల్తీ చేస్తే వాహనాలు అసలు పని చేస్తాయా? బండ్లు పాడైపోవూ? ఇంత చిన్న లాజిక్ మిస్ చేసిన ఆ బంక్ ఓనర్ పాపం ఇప్పుడిలా పండింది. ముఖ్యమంత్రి వాహనాలు తన బంకుకు వస్తాయని.. అందులో వర్కర్స్ కల్తీ డీజిల్ పోస్తారని.. అవి అక్కడే ఆగిపోతాయని.. తన పెట్రోల్ బంక్ సీజ్ అవుతుందని.. ఆ యజమాని ఊహించలేక పోయాడు. ఇప్పుడు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇలా కల్తీ దందా ఎన్నాళ్లుగా సాగుతోందో ఏమో. మరోవైపు, పొరబాటున డీజిల్ ట్యాంక్‌లో వాటర్ కలిశాయేమోనని కూడా అంటున్నారు. ఇదంతా మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాంలో జరిగింది. సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్‌లోని 19 వాహనాల్లో నీళ్లు కలిసిన డీజిల్‌ నింపారనే న్యూస్ ఆ స్టేట్‌లో షాకింగ్ న్యూస్‌గా మారింది. ఇంతలా కల్తీ జరుగుతున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×