Tollywood:ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మరణం అభిమానులను పూర్తిస్థాయిలో కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి (Krishnaveni) మరణించారు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీని పూర్తిగా విషాదంలో ముంచేసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 102 సంవత్సరాలు.. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణవేణి వయోభారంతోనే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి, పలు చిత్రాలను నిర్మించిన ఈమె భారీ పాపులారిటీ అందుకున్నారు.
లెజెండ్రీ యాక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణవేణి..
ముఖ్యంగా తన సినిమాల ద్వారా ఎంతో మంది లెజెండ్రీ యాక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణికే సొంతం.అలా సీనియర్ హీరో నందమూరి తారక రామారావు (Sr.NTR) ను సినీ రంగానికి హీరోగా పరిచయం చేశారు. కూడా ఈమె. ముఖ్యంగా ఈమె నిర్మించిన ‘మన దేశం’ సినిమాలో స్వర్గీయ నటులు ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలో తన నట విశ్వరూపంతో ఒక అసమాన చరిత్రను ఆయన లిఖించడం జరిగింది. అలాగే దివంగత సంగీత దర్శకులు ఘంటసాల (Ghantasala) ను కూడా సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణికే.. అక్కినేని నాగేశ్వరరావు(ANR ) తో ఎన్నో సినిమాలు నిర్మించిన ఈమె.. నటిగా, నిర్మాతగా , నేపథ్య గాయనిగా కూడా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు.
కృష్ణవేణి బాల్యం.. సినిమా జీవితం..
కృష్ణవేణి పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924 డిసెంబర్ 24న జన్మించింది. సినీ పరిశ్రమలోకి రాకముందు డ్రామా ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె, 1936 లోనే ‘సతీ అనసూయ’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసింది. దీన్ని బట్టి చూస్తే అతి చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది అంటే సినిమా కోసమే ఆమె జన్మించింది అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. కృష్ణవేణి తండ్రి వృత్తిరీత్యా వైద్యులు. తెలుగు సినిమాలలో నటించేందుకు ఆఫర్లు రావడంతో ఆమె కోసం 1939 లోనే వారి తల్లిదండ్రులు చెన్నైకి మకాం మార్చారు. ఆ తర్వాత కూతురిని ఇండస్ట్రీలో ముందుకు తీసుకువెళ్లాలని చెన్నైకి వెళ్ళిన వీరు ఆమె చలాకీతనం, అందం చూసి దర్శకులు ఆమెకు తెలుగుతో పాటు తమిళ్లో కూడా అవకాశాలు ఇచ్చారు. అలా ఎన్నో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. హీరోయిన్ గా వాళ్ళు అవకాశాలు అందుకొని కెరియర్ పరంగా పిక్స్ లో ఉన్న కృష్ణవేణి మీర్జాపురం రాజావారితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి వివాహ బంధంగా మారింది. ఇంకా ఎన్నో చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. 2004లో కృష్ణవేణికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించగా.. ఇటీవలే ఎన్టీఆర్ వజ్రోత్సవం సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు శ్రీమతి కృష్ణవేణి సత్కరించారు.
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూత..
1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయిన కృష్ణవేణి
1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణవేణి
మీర్జాపురం రాజాతో కృష్ణవేణి ప్రేమ వివాహం
గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో… pic.twitter.com/CxdusSCFbW
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025