BigTV English

Hyderabad : నా లవర్‌కే కాల్ చేస్తావా? గ్యాంగ్ వార్.. కొట్టి చంపిన ప్రియుడు..

Hyderabad : నా లవర్‌కే కాల్ చేస్తావా? గ్యాంగ్ వార్.. కొట్టి చంపిన ప్రియుడు..

Hyderabad : అంతా యంగ్ యువకులే. పట్టుమని 16 ఏళ్లు కూడా ఉండవు. అప్పుడే ప్రేమ, దోమ అంటూ తిరుగుతున్నారు. కొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు చంపే వరకూ వెళుతోంది మేటర్. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో అలాంటి దారుణమే జరిగింది. ఓ అమ్మాయి కోసం ఇద్దరు యువకులు గ్యాంగ్ వార్‌కు దిగారు. తీవ్రంగా కొట్టుకున్నారు. ఆ గొడవలో ఓ కుర్రాడు చనిపోవడం కలకలం రేపింది.


ఫోన్‌లో మొదలైన గొడవ..

హైదరాబాద్, కుషాయిగూడలో జరిగిందీ దారుణం. జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతినగర్‌లో ఉండే అయాన్.. ఓ అమ్మాయితో ఫ్రెండ్ షిప్ ఉంది. ఫ్రెండే కదాని ఆ అమ్మాయి కూడా క్యాజువల్‌గా అతనితో మాట్లాడుతోంది. పరస్పరం ఫోన్లు కూడా చేసుకుంటున్నారు. వారిద్దరీ ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ, మధ్యలో ఆ యువతికి లవర్‌ను అంటూ ఒకడు ఎంటర్ అయ్యాడు. నా ప్రియురాలితో ఎందుకు మాట్లాడుతున్నావంటూ అయాన్‌కు ఫోన్ చేసి బూతులు తిట్టాడు. నా ఇష్టం.. నేను మాట్లాడితే నీకేంటి? అంటూ అయాన్ సైతం గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఫోన్లో మాటా మాటా పెరిగింది. చూస్కుందాం అంటే చూస్కుందాం అంటూ సవాళ్లు చేసుకున్నారు. అయితే, రాధికా థియేటర్ దగ్గరికి రా అంటూ రెచ్చగొట్టుకున్నారు.


గ్రౌండ్‌లో గ్యాంగ్ వార్

కట్ చేస్తే… వాళ్లిద్దరూ రాధిక థియేటర్ దగ్గరికి వచ్చారు. అయాన్‌పై దాడి చేయాలని అపొజిట్ గ్యాంగ్ ముందే ప్లాన్ చేసింది. వాళ్లు 8మంది కలిసి వచ్చారు. అయాన్ ఒక్కడే అయిపోయాడు. కాసేపు తిట్టుకున్నారు. ఆ తర్వాత కంట్రోల్ తప్పారు. గొడవ స్టార్ట్ అయింది. తోసుకున్నారు.. కొట్టుకున్నారు. అంతా కలిసి అయాన్‌ను తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తాళలేక అతను స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలిసి స్థానికులు 108కు కాల్ చేశారు. అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ చేస్తుండగా.. అయాన్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. అయాన్‌ను కొట్టిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ యువతకు ఏమైంది?

ఎంత దారుణం. ఎంత విషాధం. 16 ఏళ్ల యువకుడిని కొట్టి చంపడమేంటి? కొట్టింది కూడా అదే ఏజ్ కుర్రాళ్లు. ఆ వయస్సులో ఈ కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఏంటి? ఇదంతా సినిమాలు, పబ్‌జీ లాంటి గేమ్‌లు, సోషల్ మీడియా ప్రభావమా? అంత చిన్న వయస్సులో ఎందుకింతలా విచక్షణ కోల్పోతున్నారు? స్నేహితురాలితో మాట్లాడుతున్నాడనే రీజన్‌తో అయాన్‌పై మూకుమ్మడిగా దాడి చేసి కొట్టి చంపేశారంటే.. యువత ఎంతగా వయలెంట్‌గా మారిపోతోందో తెలుస్తోంది. పేరెంట్సే తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. హద్దు మీరకుండా ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ ఉండాలి. లేదంటే, అయాన్‌లా చనిపోవడమో.. అతన్ని చంపిన కేసులో మరో యువకుడు జీవితాంతం జైల్లో ఉండటమో. రెండు ప్రాణాలు.. రెండు కుటుంబాలు.. సర్వనాశనం.

Related News

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో స్టూడెంట్ డెడ్‌బాడీ

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Big Stories

×