HHVM Part 2: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల పిల్లలు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే తదుపరి జనరేషన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయం తెలిసిందే . ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కుమారుడు అకీరా (Akira) కూడ ఇండస్ట్రీలోకి రావటం కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే అకీరా కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
అకీరా పాత్ర ఉండదా…
ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా మొదటి భాగం ఈనెల 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే మరొక కొత్త తేదీని కూడా ప్రకటిస్తామని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు తన కుమారుడు అఖీరా కూడా షూటింగ్ లోకేషన్ కి వెళ్లడం, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా అకీరా ఫోటోలు బయటకు రావడంతో ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని అందరూ భావించారు. వీరమల్లు మొదటి భాగంలో కాదు రెండో భాగంలో అకీరా ఒక పాత్రలో నటించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాతకు ఇదే ప్రశ్న ఎదురయింది.
విభిన్నమైన జానర్…
వీరమల్లు పార్ట్ 2 లో అకీరాను కూడా దించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.. ఇది నిజమేనా? ఒకవేళ ఉంటే ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నిర్మాత ఏ.యం.రత్నం(A.M Ratnam) సమాధానం చెబుతూ… ఈ సినిమాలో అకీరా నటించలేదని క్లారిటీ ఇచ్చారు. వీరమల్లు సినిమా ఒక స్పెషల్ జోనర్ సినిమా. ఈ సినిమాలో అకీరాను గెస్ట్ పాత్రలో చూపించడం ఇష్టం లేదని, తనని ఇండస్ట్రీకి లాంచ్ చేస్తే ఫ్రెష్ గానే ఒక మంచి కథతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని తెలిపారు. అకీరా కూడా చూడటానికి ఆరడుగుల అందంతో ఉంటారు. ఆయనకు అనుగుణంగా అదే రేంజ్ లో ఉండే కథ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇలా ఆ రేంజ్ లో కథ ఉండాలి అంటే అకీరా కోసం ఏదైనా కథ సిద్ధం చేశారా? అనే ప్రశ్న ఎదురవడంతో ఇప్పటివరకు తనతో సినిమా గురించి ఎక్కడ చర్చించలేదని, అసలు తనకు సినిమాలలోకి రావాలనే ఆసక్తి ఉందా? లేదా? అనేది కూడా తెలియాలి కదా అంటూ నిర్మాత రత్నం తెలిపారు. ఇక అకీరాకు సినిమాల కంటే కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఇలా అకీరా పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాలో నటించబోతున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలకు నిర్మాత ఏ.యం రత్నం క్లారిటీ ఇస్తూ ఈ వార్తలకు చెక్ పెట్టారు.