AP News : కీర్తన, హరినాథ్. ఇద్దరూ లవర్స్. హరినాథ్ బీటెక్ స్టూడెంట్. కీర్తన స్పిన్నింగ్ మిల్‌లో వర్క్ చేస్తోంది. అందరు లవర్స్ లానే ఈ ప్రేమజంటకు కూడా పెద్దల నుంచి కష్టాలే. తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోరని ఫిక్స్ అయ్యారు. గ్రామ సమీపంలోని కొండ మీదకు వెళ్లారు. పక్కనే క్వారీ గుంత ఉంది. గుట్ట మీద నుంచి ఆ గుంతలో ఇద్దరూ దూకేశారు. కట్ చేస్తే.. యువతి సేఫ్‌గా ఇంటికి తిరిగొచ్చింది. ఇదంతా ఆమె చెప్పిన స్టోరీనే. ఆ యువకుడు ఆచూకీ మాత్రం కనిపించట్లేదు. ఏమై పోయాడు? గుట్ట మీది నుంచి దూకి చనిపోయాడా? మరి, కీర్తన ఎలా బతికింది? ఇలా అనేక ట్విస్టులు ఉన్నాయీ రియల్ స్టోరీలో.
అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం చౌడవరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. వాళ్లిద్దరూ కొండపై నుంచి గుంతలో దూకగా.. కీర్తన బానే ఉంది కానీ.. హరినాథ్ మాత్రం అడ్రస్ లేకుండా పోయాడు. క్వారీ గుంతలో గజ ఈతగాళ్లతో గాలించినా ఫలితం లేదు. డ్రోన్‌తో గుట్ట చుట్టు పక్కల ప్రాంతమంతా సెర్చ్ చేస్తున్నారు. కీర్తన చెబుతున్న విషయాలు అనేక అనుమానాలకు తెరలేపుతున్నాయి. ఆత్మహత్య పేరుతో పేరెంట్స్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికే సూసైడ్ అటెంప్ట్ డ్రామా ప్లే చేసినట్టు డౌట్. ముందుగానే స్నేహితులకు సమాచారం ఇచ్చి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరం వచ్చి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని.. కానీ స్థానికులు తనను మాత్రం కాపాడారని ఆ యువతి చెబుతోంది.
బంధువులే చంపేశారా?
మరో ట్విస్ట్ ఏంటంటే.. యువతిని కాపాడింది ఆమె బంధువులే అని తెలుస్తోంది. వారే ఆ యువకుడిని ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు యువకుడికి డెడ్ బాడీ లభించకపోవడంతో యువతి మాటలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మిస్సింగ్ కేసు నమోదు చేసి హరినాథ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
అంతా కట్టు కథా? నిజమేనా?
యువతి చెప్పినట్టు నిజంగానే ఆత్మహత్య చేసుకోవడంతో యువకుడు చనిపోయాడా? చనిపోతే శవం ఎక్కడ? యువతి బంధువులే చంపేసి అబద్దం చెప్తున్నారా? అసలు యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కోసం క్వారీలో దూకాడా? లేదంటే, యువతి దూకిన తర్వాత యువకుడు పరారయ్యాడా? ఇలా అనేక ప్రశ్నలు, అంతకుమించి అనుమానాలు.