Retro: తమిళ్ సూపర్ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రూపొందించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ మన ముందుకు వచ్చింది. సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. శ్రియ స్పెషల్ సాంగ్ తో మూవీలో కనిపించారు. స్టోన్ బెంజ్ క్రియేషన్స్ స్టూడియో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ ఈ సినిమాని నిర్మించారు. మే 1న రెట్రో థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనతో కొనసాగుతుంది. తాజాగా కలెక్షన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. ఆ వివరాలు చూద్దాం..
ఫైనల్‌గా పోస్టర్ వచ్చేసింది..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 45వ చిత్రంగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా రెట్రో. దాదాపు ఈ సినిమా బడ్జెట్ 65 కోట్లు. ఈ చిత్రానికి పోటీగా నాని హిట్ త్రీ, అజయ్ దేవగన్ రైడ్ 2 పోటీకి నిలిచాయి. ఈ చిత్రం విడుదలై ఐదు రోజులు అవుతున్న మొదటిరోజు కలెక్షన్ పోస్టులను రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాత నాలుగు రోజులుగా ఎటువంటి పోస్టర్ రాలేదు తాజాగా ఈరోజు మూవీ కలెక్షన్ పోస్టర్ న రిలీజ్ చేశారు. సూర్య రెట్రో మూవీ 5వ రోజు 100 కోట్ల క్లబ్ లో చేరిపోయినట్లు పోస్టర్ ని రిలీజ్ చేశారు. వరల్డ్ వైస్ గా 14 కోట్లు అంటూ మూవీ టీం సూర్య రెట్రో పోస్ట్ అని రిలీజ్ చేసింది. దీంతో సూర్య ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు. సూర్య క్రేజ్ కి ఇది కొంత తక్కువనే చెప్పాలి. రిలీజ్ అయిదు రోజులు అవుతుంటే ఇప్పుడు 100 కోట్ల క్లబ్లో చేరింది. మరీ రెట్రో కి ఇంత టైం పట్టింది ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సూర్య రెట్రో 100 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఆనందించాల్సిన విషయమే అంటున్నారు ఫ్యాన్స్.
అది సూర్య క్రేజ్..
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 104 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఉత్తర అమెరికాలో రెట్రో మొదటి నాలుగు రోజుల్లోనే నాలుగు లక్షల డాలర్లను వసూల్ చేసింది. కంగువా పాన్ ఇండియా మూవీ గా మన ముందుకు వచ్చిన, ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. సూర్య ఆశలన్నీ రెట్రో పైనే పెట్టుకున్నాడు. అయితే ఈ మూవీ మిక్సీ టాక్ వచ్చిన ఐదు రోజుల్లోనే 104 కోట్లు వసూలు చేయడం అంటే అది సూర్య క్రేజ్ వల్ల మాత్రమే సాధ్యమైందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.
గ్యాంగ్ స్టర్ కథ ..
ఇక కథ రెట్రో 1980 నేపథ్యంలో సాగే పిరియాడిక్ గ్యాంగ్స్టర్ స్టోరీ. ఇందులో సూర్య మాజీ గ్యాంగ్స్టార్ ఆయన తన గతాన్ని వదిలేసి తన భార్య తో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. అయితే ఆయన గతాన్ని వదిలేసిన గతం మాత్రం ఆయన వెంటపడుతుంది ఫలితంగా పాత శత్రువులు మళ్ళీ తిరిగి అనే జీవితంలోకి వస్తారు అలా హీరో, తన భార్య దగ్గర దాచిన రహస్యాలన్నీ బయటపడతాయి. దీంతో ఆయన భార్య ఆయనను కొన్ని రోజులు దూరం పెడుతుంది. అది సహించని సూర్య తన రౌడీయిజాన్ని వదిలి పెట్టాలనుకున్న, గతం వెంటాడడంతో వారిపై తిరగబడతాడు. మరి ఆ పోరాటంలో సూర్య వారిపై ఎలా గెలిచాడు మాజీ గ్యాంగ్స్టర్ దాచిపెట్టిన ఆ సీక్రెట్స్, ఆయన గతం ఏంటి అని తెలియాలంటే సినిమాను మనం వెండితెరపై చూడాల్సిందే. సూర్య యాక్షన్ ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది. ఇక ఈ చిత్రంలో జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్, వారు నటించారు.