BigTV English

Ratan Tata Dog: నీ వెంటే నేనుంటా.. టాటా అంత్యక్రియల్లో పాల్గొన్న పెంపుడు కుక్క గోవా.. కన్నీళ్లు ఆగవు

Ratan Tata Dog: నీ వెంటే నేనుంటా.. టాటా అంత్యక్రియల్లో పాల్గొన్న పెంపుడు కుక్క గోవా.. కన్నీళ్లు ఆగవు

Ratan Tata’s Dog Goa paysTribute: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) అస్తమించారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట్లలో చికిత్సపొందుతూ చనిపోయారు. టాటా మృతి పట్ల దేశ ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహనీయుడికి నివాళి అర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు టాటా పార్దివదేహాన్ని అభిమానులు చూసేందు కోసం ముంబైలోని NCPA మైదానంలో ఉంచారు.


కంటతడి పెట్టించిన టాటా పెట్ డాగ్ గోవా

టాటా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన సమయంలో ఆయన పెట్ డాగ్ గోవా అందరినీ కంటతడి పెట్టించింది. తన యజమాని పక్కనే కూర్చొని ఏడుస్తూ కనిపించింది. టాటా భౌతికకాయం వైపు చూస్తూ తన మనసులోని బాధను బయటపెట్టుకుంది. యజమాని లేరని తెలిసి పెట్ డాగ్ పడుతున్న బాధ అందరినీ ఆవేదనకు గురి చేసింది.


కుక్కలంటే టాటాకు ఎంతో ఇష్టం

రతన్ టాటాకు కుక్కలు అంటే ఎంతో ఇష్టం. కుక్కల కోసం ఆయన ఏకంగా రూ. 160 కోట్లతో హాస్పిటల్ నిర్మించారు. తాజ్ మహల్ హోటల్, తాజ్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ సహా అన్ని టాటా ప్రాంగణాల్లోకి పెంపుడు కుక్కలను అనుమతించేవారు. మూగ జీవాల టాటా మీద ఎనలేని ప్రేమను కనబరిచేవారు. కుక్కలంటే అమితంగా ఇష్టపడే టాటాకు గోవా డాగ్ అంతే చాలా ఇష్టం. అసలు ఇంతకీ ఆయన పెంపుడు కుక్కకు ‘గోవా’ అని ఎందుకు పెట్టారంటే.. టాటా ఓసారి గోవాకు పిక్నిక్ కు వెళ్లారు. ఆయన వాకింగ్ చేస్తుండగా, ఆ కుక్క తన వెంట నడుస్తూ వెళ్లింది. తన దగ్గరికి వచ్చి ప్రేమగా తోక ఊపుతూ కాసేపు ఆడుకుంది. ఆ కుక్క టాటాకు చాలా నచ్చింది. దాన్ని ముంబైకి తీసుకొని వచ్చారు. గోవా నుంచి తీసుకొచ్చారు కాబట్టి దానికి గోవా అని పేరు పెట్టారు. టాటా ప్రధాన కార్యాలయం అయిన బాంబే హౌస్ లో గత 11 సంవత్సరాలుగా నివసిస్తున్నది. టాటా ఈ డాగ్ ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు.

 

View this post on Instagram

 

 కుక్కను అనారోగ్యం, లండన్ పర్యటన రద్దు చేసుకున్న టాటా

రతన్ టాటాకు కుక్కలంటే చెప్పలేనంత ఇష్టం. తన పెట్ డాగ్ కారణంగా ఓసారి ఏకంగా లండన్ పర్యటన రద్దు చేసుకున్నారు. బంకింగ్ హామ్ ప్యాలెస్ లో ప్రిన్స్ చార్లెస్ ఆయనను సతస్కరించాల్సి ఉంది. కానీ, ఆయన పెట్ డాగ్ అనారోగ్యానికి గురి కావడంతో ముఖ్యమైన ప్రయాణాన్ని సైతం రద్దు చేసుకున్నారు. ఈ విషయం బ్రిటన్ ప్రిన్స్ కు తెలిసి మూగ జీవివాల పట్ల టాటాకు ఉన్న ప్రేమకు ఫిదా అయ్యారట. టాటా చనిపోయే వరకు పెంపుడు జంతువుల పట్ల ఎంతో ప్రేమను చూపించారు.

Read Also: రతన్ టాటా భుజం మీద చేయి వేసిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఇతడి వయసు ఎంతంటే?

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×