BigTV English

Baby Sold Beer: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ

Baby Sold Beer: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ

Baby Sold Beer| కష్టపడి సంపాదించడం ఇష్టం లేక దొంగతనాలు, దోపిడీలకు అలవాటు పడ్డ ఇద్దరు ప్రేమికులు.. చివరికి తమకు పుట్టిన బిడ్డను విక్రియంచేశారు. కొన్ని బీర్ క్యాన్లు, 1000 డాలర్ల ధరకు పసిబిడ్డను వేరే వ్యక్తికి అమ్మేశారు. అయితే వారి చేతికి బీర్ క్యాన్లు మాత్రమే దక్కాయి. అయితే పోలీసులుకు సమాచారం అందడంతో వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని అర్కన్సాస్ రాష్ట్రంలో జరిగింది.


వివారల్లోకి వెళితే.. అర్కన్సాస్ రాష్ట్రంలో బెంటన్ కౌంటీకి చెందిన డేరియన్ అర్బన్ (21), అతని గర్లఫ్రెండ్ షేలీన్ (20) కు రెండు నెలల క్రితమ ఒక మగబిడ్డ పుట్టాడు. అయితే వారిద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేసొకొని జీవనం సాగిస్తున్నారు. ఇంతకుముందు ఇద్దరూ దొంగతనాల కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు.

Also Read: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!


అయితే ఇటీవల వీరిద్దరూ తమ బిడ్డను పోషించే స్థోమత లేక విక్రయించాలని ప్రయత్నించారు. దీనికోసం ఒక రికీ క్రాఫోర్డ్ అనే ఏజెంట్ ను సంప్రదించారు. రికీ బిడ్డను చూసి వేయి డాలర్ల ధర నిర్ణయించాడు. కానీ అంత తక్కువ ధరకు వారిద్దరూ ఒప్పుకోకపోవడంతో కొన్ని బీర్ క్యాన్లు అదనంగా ఇచ్చేందకు ఒప్పుకున్నాడు.

మరోవైపు బిడ్డ కొనుగోలు చేయడానికి మార్టిన్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. అలా కొన్ని రోజుల క్రితం మార్టిన్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ వద్ద డీల్ కుదిరింది. అయితే అపార్ట్ మెంట్ మేనేజర్ కు ఈ విషయం తెలిసి అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని నలుగురిని అరెస్టు చేశారు.

వారి వద్ద నుంచి వేయి డాలర్ల చెక్కుతో పాటు, కొన్ని బీర్ క్యాన్లు, ఒక కాంట్రాక్లు పేపర్ స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టులో పసిబిడ్డను మార్టిన్ దత్తత తీసుకుంటున్నట్లు ఉంది. పైగా డేరియన్, షేలీన్ ఇద్దరూ తాము ఇకపై బిడ్డపై తమకు ఏ విధమైన అధికారాలు ఉండవని రాసిచ్చారు.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

పోలీసులు మార్టిన్ వద్ద నుంచి బిడ్డను స్వాధీనం చేసుకోగా.. పసిబిడ్డను దుర్వాసన వస్తోంది. బిడ్డ డైపర్ నిండా మలం ఉండడంతో వీపు భాగమంతా బొబ్బలు, రాషెస్, ఇన్‌ఫెక్షన్ ఉంది. పసిబిడ్డ ముఖం అంతా వాచి పోయి ఉన్నట్లు పోలీసులు గమనించి ఆస్పత్రికి తరలించారు. డేరియన్, షేలీన్ విలాస జీవనశైలికి అలవాటు పడి.. బిడ్డను పోషించే బాధ్యత నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో విక్రయించాలనుకున్నారని పోలీస్ అధికారి డిటెక్టెవ్ వెస్ గ్రూబే తెలిపారు.

ఇంతకుముందు డేరియన్ ఒక దొంగతనం కేసులో, ఒక మహిళపై రేప్ కేసులో జైలు కెళ్లాడని అతను ప్రొబేషన్ లో ఉన్నాడని చెప్పారు. అలాగే షేలీన్ కూడా ఒక షాపులో దొంగతనం చేస్తూ పట్టుబడిందని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరినీ చిన్న పిల్లల ట్రఫికింగ్, మైనర్ కు ప్రాణహాని తలపెట్టే యత్నం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. మార్టిన్, ఏజెంట్ రికీ ఇద్దరినీ చిన్న పిల్లల ట్రఫికింగ్ కేసులో అరెస్టు చేశారు.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×