Biryani Murder| క్షణికావేశంలో చేసిన తప్పులు కొన్నిసార్లుగ ప్రాణాంతకంగా మారుతాయి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు అన్థాలకు దారి తీస్తాయి. అలాంటి ఒక ఘటన ఛత్తీస్ గడ్‌లో రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గడ్ రాష్ట్రం సూరజ్ పూర్ జిల్లాలోని అంబికా పూర్ ప్రాంతంలో చీరలకు ఫ్యాన్సీ వర్క్ చేసే ఇద్దరు కార్మికులు జగపతి, అమరేష్ ఒక అద్దె గదిలో నివసిస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఒకే షాపు ఓనర్ వద్ద చీరలకు ఫ్యాన్సీ వర్క్ చేస్తూ.. ఆనందంగా ఉండేవారు. తరుచూ ఇద్దరూ కలిసి సినిమాలకు, షికార్లకు వెళుతూ ఉండేవారు.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
ఈ క్రమంలో ఒకరోజు జగపతి స్వగ్రామం వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ రోజు అమరేష్ ఇద్దరి కోసం స్విగ్గీ ద్వారా బిర్యానీ బుక్ చేశాడు. అయితే డెలివరీ వారి అద్దె రూమ్ వద్దకు వచ్చింది. అమరేష్ షాపులో పనిచేసి ఇంటికి వచ్చి చూస్తే.. రూమ్ లో బిర్యానీ కనిపించలేదు. జగపతి నిద్రపోతున్నాడు. అతడిని నిద్రలేపి తన బిర్యానీ ఎక్కడుందని అడిగితే.. తాను తినేశాననీ జగపతి సమాధానం చెప్పాడు. “ఇద్దరి కోసం తెప్పించిన బిర్యానీ ఒక్కడివే తినేశావా?” అని అమరేష్ అడిగాడు. జగపతి తనకు బాగా ఆకలి వేస్తే.. మొత్తం తినేశానని చెప్పాడు.
జగపతి సమాధానం విని అమరేష్ కు కోపం వచ్చింది. అప్పటికే రాత్రి 11 గంటల సమయం కావడంతో బయట ఎక్కడా భోజనం లేదు. దీంతో ఆకలి మీద ఉన్న అమరేష్ కోపంతో జగపతిని తిట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకున్నారు. అయితే అమరేష్ బలంగా జగపతి ఛాతిమీద కొట్టేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు జగపతికి జ్వరం, నోటి నుంచి రక్తం వచ్చింది. మరోవైపు అమరేష్ షాపులోనే పడుకున్నాడు.
Also Read: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం
జగపతికి తీవ్ర అనారోగ్యం చేసి కదల్లేని స్థితిలో ఉన్నాడు. తన కుటుంబ సభ్యలకు ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగోలేదని.. చెప్పగా.. జగపతి సోదరుడు అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జగపతి చనిపోయాడు. జగపతి మరణించాక అతని కుటుంబసభ్యులు అమరేష్ తో గొడవ పడ్డారు. అమరేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జగపతి మృతదేహానికి పోస్ట్ మార్టం చేయగా..అతని మరణం ఛాతిలో బలంగా దెబ్బలు తగలడం వల్లనే అని రిపోర్ట్ లో తేలింది. దీంతో పోలీసులు అమరేష్ ను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. అతను పరారయ్యాడు. ఈ ఘటన ఆగస్టు 2024లో జరిగింది. అయితే ఇటీవల అక్టోబర్ 25న అమరేష్ అచూకీ గురించి పోలీసులకు సమాచారం అందడంతో అతడిని పట్టుకున్నారు.
జగపతి హత్య కేసుపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. నిందితుడు అమరేష్‌కు హత్యా నేరంలో 7 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.