BigTV English

Brother In Law Murder: గ్రామంలో అందరిముందు భర్తను చితకబాదిన భార్య.. గొడవలో మూడో వ్యక్తి మృతి!

Brother In Law Murder: గ్రామంలో అందరిముందు భర్తను చితకబాదిన భార్య.. గొడవలో మూడో వ్యక్తి మృతి!

Brother In Law Murder| భార్యాభర్తల మధ్య గొడవలో మూడో వ్యక్తి కలుగజేసుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. కానీ ఒక వ్యక్తి ఆ తప్పు చేశాడు. చివరికి తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఆ మూడో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లా నారౌలీ గ్రామంలో నవంబర్ 27 రాత్రి ఒక యువకుడు దారిలో వెళుతుండగా.. వెనుక నుంచి ముగ్గురు యువకులు మంకీ క్యాప్ వేసుకొని బైక్లపై వచ్చారు. వచ్చీ రాగానే ఆ యువకుడిపై తుపాకులతో కాల్పులు జరిపారు. పోలీసులు ఈ కేసు విచారణ ప్రారంభించారు. కానీ హత్య వెనుక కారణాలేంటో వారికి అర్థం కాలేదు. చనిపోయిన యువకుడి పేరు టీటూ చౌదరి (28) అని తెలిసింది.

టీటూ చౌదరి వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతని కుటుంబలో తల్లిదండ్రులు, ఒక సోదరి దీపా (23) ఉన్నారు. దీపాకు రెండేళ్ల క్రితం విక్రం (27) అనే యువకుడితో వివాహం జరిగింది. విక్రం ఇంతకుముందు మీర్జాపూర్ లో ఉద్యోగం చేసేవాడు. కానీ అక్కడ ఏదో సమస్య వచ్చి ఉద్యోగం పోయింది. దీంతో అతను తిరిగి తన స్వగ్రామం నారౌలికే వచ్చాడు. గత మూడు నెలలుగా ఇంటి వద్దనే భార్యతో కలిసి ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఖాళీగా ఉండడంతో అతని భార్య దీపాతో చిన్న చిన్న విషయాల్లో గొడవ పడేవారు.


ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఒక రోజు ఇంట్లో దీపా, విక్రమ్ మధ్య గొడవ జరుగుతూ ఉండగా.. దీపా సోదరుడు టీటూ అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో విక్రం కోపంలో తన భార్యను తిట్టాడు. ఇదంతా అక్కడే ఉండి చూసిన టీటూ చౌదరి కోపంతో తన బావ విక్రంపై దాడి చేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీపా కూడా తన అన్న టీటూతో కలిసి తన భర్త విక్రంని చితకబాదింది. ఈ క్రమంలో వారి గొడవ వల్ల శబ్దాలకు గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. విక్రం వేసుకొని ఉన్న బట్టలు చింపేసి.. మరీ టీటూ తన బావను కొట్టాడు.

ఈ ఘటన తరువాత విక్రం అవమానకరంగా ఫీలయ్యాడు. తన అవమానానికి పగతీర్చుకునేందకు అమ్రోహా అనే పక్క ఊరికి వెళ్లి అక్కడ సుపారి గ్యాంగ్ స్టర్లతో కలిశాడు. అక్కడ ఫైజాన్ అనే షూటర్ తో బేరం మాట్లాడుకున్నాడు. తన ఊరికి వచ్చి తన బావ టీటూ చౌదరిని హత్య చేయాలని చెప్పాడు. అందుకోసం షూటర్ ఫైజాన్ రూ.1.5 లక్ష డిమాండ్ చేశాడు. అందుకు విక్రం అంగీకరించాడు.

అలా నవంబర్ 27 2024 రాత్రి టీటూ చౌదరి ఒంటరిగా నారౌలి గ్రామ పొలిమేరు వద్ద వెళుతుండగా.. వెనుక నుంచి రెండు బైక్లపై మగ్గురు వ్యక్తుల వచ్చి కాల్పులు జరిపారు. వారిలో ఒకరు ఫైజాన్ మరొకరు నదీం. మూడో వ్యక్తి స్వయంగా విక్రమ్. టీటూ చౌదరి ఆ కాల్పులు చనిపోయాడు. కానీ పోలీసులు సిసిటీవి సాయంతో దుండగులు ఎటు వైపు వెళ్లారో తెలుసుకొని ఆ దారి లో ఉన్న అన్ని సిసిటీవి కెమెరాల్లో చూసి.. ఆ ముగ్గురు పక్కక గ్రామం వెళ్లినట్లుగా తెలుసుకున్నారు. ఆ ముగ్గురిలో విక్రంని పోలీసులు కనిపెట్టేశారు.

విక్రంని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. చివరకు అతను తన నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు టీటూ చౌదరి హత్య కేసులో విక్రంతో పాటు ఫైజాన్ ని అరెస్టు చేశారు. కాల్పులు జరిపిన మూడో వ్యక్తి నదీం ప్రస్తుతం పరారీలో ఉన్నటల్ తెలిసింది.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×