Mohammed Siraj: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border Gavaskar Trophy 2024/25 ) భాగంగా ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం మూడవ మ్యాచ్ కొనసాగుతోంది. బ్రిస్ బెన్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో… నిన్న మొదటి రోజు వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం ఐదు గంటల 50 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది.
Also Read: Rohit Sharma: 20 కేజీలు పెరిగిపోయిన రోహిత్ శర్మ…ఇక రిటైర్మెంట్ ?
అయితే ఇవాళ మ్యాచ్ ప్రారంభమైన నేపథ్యంలో…. ఆస్ట్రేలియాజట్టు వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ… టీమిండియా కు మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) కు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ వదిలి… డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు టీమిడియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ).
ఇన్నింగ్స్ 37వ ఓవర్… వేశాడు మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ). అయితే ఈ ఓవర్ వేస్తున్న నేపథ్యంలోనే… ఆయన మోకాలి నొప్పితో బాధపడుతూ… కనిపించడం జరిగింది. బౌలింగ్ చేసే క్రమంలో వేగంగా పరిగెత్తిన సిరాజుకు… కండరాలు పట్టేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ…మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj )… వెంటనే… గ్రౌండ్ వదిలి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు.
Also Read: Sara Tendulkar – Gill: గిల్ కోసం రంగంలోకి సారా…ఇక డబుల్ సెంచరీ పక్కా ?
ప్రస్తుతం అతనికి స్కానింగ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ స్కానింగ్లో… ఏదైనా జరిగితే… టీమిండియా కు భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ మ్యాచ్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) తొలగిపోతే…. టీమిండియా కు మరో ఫాస్ట్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించే ఈ పిచ్ లో.. సిరాజు బౌలింగ్ చాలా కీలకం. అతను లేకపోతే… టీమిండియా ఓడిపోయిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్లు అత్యంత దారుణంగా భయంకరంగా బౌలింగ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఇవాళ ఉదయం మ్యాచ్ ప్రారంభమైన తర్వాత… మూడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. దీంతో లంచ్ సమయం వరకు… 104 పరుగులు చేసిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్ లో స్టీవ్ స్మిత్ 25 పరుగులు, ట్రావెల్స్ హెడ్ 20 పరుగులతో రాణిస్తున్నారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 43 ఓవర్లు ఆడింది. ఇది ఇలా ఉండగా.. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న తరుణంలోనే… శుభ్ మన్ గిల్ ప్రియురాలు.. సారా టెండూల్కర్ స్టేడియంలో మెరిసిన సంగతి తెలిసిందే. నిన్న కెమెరాలకు చిక్కిన సారా టెండూల్కర్… మ్యాచ్ తిలకించింది. దీంతో శుభ్ మన్ గిల్ కోసమే… సారా టెండూల్కర్ వచ్చిందంటూ కామెంట్స్ చేశారు.