BigTV English

Mother And Daughter Physically Abused| ‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను అనుభవించాడు.. నా కూతురిపై కూడా’

Mother And Daughter Physically Abused| ‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను అనుభవించాడు.. నా కూతురిపై కూడా’

Mother And Daughter Physically Abused| భర్తతో విడిపోయిన తరువాత ఆ మహిళ తన కూతురితో పుట్టింటికి వచ్చేసింది. ఆ తరువాత మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపింది. అతను కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ మహిళ కూతురు తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది. కానీ అప్పటికే ఆ వ్యక్తి పరారయ్యాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని అజ్మేర్ జిల్లాలో జరిగింది.


అజ్మేర్ జిల్లాలోని రామ్ గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంజిత (36, పేరు మార్చబడినది) అనే మహిళ రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి తన పుట్టింటికి వచ్చేసింది. ఆమెకు తన భర్త వల్ల 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆమె భర్తతో గొడవ పడి విడిపోయినప్పటి నుంచి తన కూతురితో విడిగా నివసిస్తోంది. ఈ క్రమంలో రంజితకు ధనీరామ్ అనే మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. ధనీ రామ్ తరుచూ ఆమె ఇంటికి వచ్చే వాడు.

Also Read: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!


రంజిత తన భర్త నుంచి విడాకులు తీసుకోగానే ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి ధనీరామ్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తరువాత ఒకరోజు రంజిత ఇంట్లో లేని సమయంలో రంజిత కూతురిపై ధనీరామ్ అత్యాచారం చేశాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలికి బెదిరించాడు. ఇంట్లో తన తల్లి రాగానే ఆ అమ్మాయి.. జరిగినదంతా చెప్పింది. ఇది విని షాకైన రంజిత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులో ధనీరామ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. ఆ తరువాత తన కూతురిపై అత్యాచారం చేశాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధనీరామ్ కోసం గాలిస్తున్నారు. ధనీరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Also Read: పెళ్లికి నిరాకరించిన 40 ఏళ్ల ప్రియురాలు.. బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తామని..

Related News

Kurnool News: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి

Hyderabad News: దారుణం.. భర్తతో గొడవ పెట్టుకుని, ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

Crime News: ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన టెన్త్ స్టూడెంట్.. చివరకు టీచర్లపై?

Gadwal Tragedy: విషాదం.. చిన్నారి పైనుంచి వెళ్లిన స్కూల్ బస్సు

One Side Love: టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించిన స్టూడెంట్.. కారణం తెలిసి అంతా షాక్

Delhi News: భార్యను చంపి.. ‘దృశ్యం’ కథ అల్లేసిన భర్త, చివరికి ఇలా దొరికిపోయాడు!

Big Stories

×