BigTV English

Kcr’s politics: కేసీఆర్ రాజకీయాలు ఇంతలా ఉంటాయా?

Kcr’s politics: కేసీఆర్ రాజకీయాలు ఇంతలా ఉంటాయా?

KCR’s politics(Political news today telangana): తెలంగాణ రాజకీయ సీనియర్ నాయకుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకరు. టీడీపీ నుంచి రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టారాయన. రాజకీయాలు చేయడంలో కేసీఆర్‌కు తిరుగులేదని నేతలు అప్పుడప్పుడు చెబుతున్నారు. చదరంగంలో ఎత్తులు పసిగట్టవచ్చని, కానీ కేసీఆర్ ఎత్తులను అస్సలు ఊహించలేమని కొందరు నేతలు ఓపెన్‌గా చెప్పిన సందర్భాలు లేకపోలేదు.


ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను గమనిస్తే.. కేసీఆర్ గడిచిన పదేళ్లలో ఎలాంటి రాజకీయాలు చేశారో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. వివిధ అంశాలపై మాట్లాడిన నేతలు సడన్‌గా టాపిక్ డైవర్ట్ అయ్యింది. కేసీఆర్ ఎలాంటి కుటిల రాజకీయాలు చేశారో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కళ్లకు కట్టినట్టు చూపించారు. రాజకీయ ఎత్తుగడలో ఎమ్మెల్యేలు పావులుగా మిగిలిపోయారు.

తెలంగాణ వచ్చిన తర్వాత తొలుత టీడీపీని ఖాళీ చేయించాలని భావించారు కేసీఆర్. ఆయన వేసిన  స్కెచ్ వర్కవుట్ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై అలాంటి అస్త్రాన్ని ప్రయోగించారాయన. ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డిని సబితఇంద్రారెడ్డి ద్వారా కాంగ్రెస్‌లోకి రప్పించారు కేసీఆర్. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఓకే అయ్యింది. వెంటనే సబితాను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి ఆమెకి మంత్రిపదవి కట్టబెట్టారు గులాబీ బాస్. ఇది కేవలం బుధవారం అసెంబ్లీలో వెల్లడైన విషయాలు.


ALSO READ: ఏడుపు ఎందుకు సబితమ్మా..? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా..??

కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి కష్టాలు దేవుడికే తెలియాలి. మల్కాజ్‌‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి, పీసీపీ పదవి ఇవ్వకుండా గులాబీ పెద్దలు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. ఢిల్లీ స్థాయిలో రాజకీయ గేమ్ మొదలుపెట్టేశారు. తెలంగాణ రాజకీయాలను గమనించిన కాంగ్రెస్ పెద్దలు రేవంత్‌రెడ్డి వైపు మొగ్గుచూపడం, ఆయనకు పీసీసీ పదవి అప్పగించడం చకచకా జరిగిపోయింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య లుకలుకలు మొదలయ్యేలా స్కెచ్ వేసింది బీఆర్ఎస్. తాము ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటే.. తాము ఉన్నామని సీనియర్లు తెరపైకి వచ్చేలా చేసింది. చివరకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు అందుకున్నారు. చివరకు కేసీఆర్ రాజకీయ ఎత్తుల్లో ఎమ్మెల్యేలు పావులుగా మారిపోయారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×