E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఓ ఇల్లు.. స్పాట్‌లో!

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఓ ఇల్లు.. స్పాట్‌లో!
Advertisement

Hyderabad Explosion: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ పేలుడు శబ్దం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సరూర్‌నగర్ పరిధిలోని బాబూనగర్‌లో మంగళవారం ఒక్కసారిగా సంభవించిన పేలుడు ధాటికి ఒక నివాస గృహం పూర్తిగా శిథిలమైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు, శబ్దాలతో అట్టుడికిపోయింది. అసలేం జరిగిందో తెలియక చుట్టుపక్కల ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.

తృటిలో తప్పిన ప్రాణనష్టం..
బాబూనగర్‌లో గత 30 ఏళ్లుగా స్థానికంగా నివాసముంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో దేవేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. పేలుడు తీవ్రతకు ఇల్లు మొత్తం కుప్పకూలిపోయినప్పటికీ.. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే వారు సురక్షిత ప్రాంతానికి చేరడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Advertisement

తప్పిన పెను ముప్పు!
ఈ ప్రమాదంలో అత్యంత ఆశ్చర్యకరమైన, ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. పేలుడు జరిగిన సమయంలో సదరు గృహంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఇల్లు మొత్తం ధ్వంసమైనా ఆ సిలిండర్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం విశేషం. ఒకవేళ ఆ సిలిండర్లు గనుక పేలి ఉంటే ప్రమాద తీవ్రత ఊహకందని విధంగా ఉండేదని, చుట్టుపక్కల ఇళ్లు కూడా తీవ్రంగా నష్టపోయేవని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ సిలిండర్లు సురక్షితంగా ఉండటంతో ఒక పెద్ద విపత్తు నగరంలో తప్పిందని చెప్పాలి.

మిస్టరీగా మారిన పేలుడు కారణం..
అయితే ఈ భారీ పేలుడు సంభవించడానికి గల అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇంట్లోని ఇన్వర్టర్ పేలిందా లేదా మరేదైనా రసాయన చర్య జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ, ఘటన జరిగిన వెంటనే పోలీసులు గానీ, ఇతర సహాయక సిబ్బంది గానీ సకాలంలో స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×