E-Paper
Advertisement

మధ్యాహ్న భోజనంలో ‘గుడ్డు’ బంద్.. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా?

మధ్యాహ్న భోజనంలో ‘గుడ్డు’ బంద్..  ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా?
Advertisement

Egg Replacement: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో గుడ్ల స్థానంలో శాఖాహారాన్ని చేర్చాలని నిర్ణయించింది. దీంతో ఈ నిర్ణయం పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ ఒక్కసారిగా జోరందుకుంది. అసలు ఈ నిర్ణయాన్ని బెంగాల్ ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? ఇది సరైనదేనా? గుడ్లకు బదులు శాఖాహారం తీసుకుంటే ఏం జరుగుతుంది? అసలు వారానికి రెండు గుడ్లు తీసుకుంటే పిల్లలకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిర్ణయం వెనుక నేపథ్యం

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించే బాధ్యతను ఇస్కాన్ ను అప్పగిస్తున్నట్లు ఇటీవల బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రకటించారు. ఒక్కో విద్యార్థిపై ఆహార వ్యయాన్ని రూ.6.50 నుంచి రూ.10కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆధ్యాత్మిక సంస్థగా పేరున్న ఇస్కాన్.. మధ్యాహ్న భోజనంలో గుడ్లు బంద్ చేస్తామని చెబుతోంది. బదులుగా రాజ్మా, పనీర్ లతో కూడిన ప్రోటీన్ పదార్థాలను పిల్లలకు అందిస్తామని ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీంతో అటు ప్రతిపక్షాలు, పిల్లల పోషకాహార నిపుణులు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

వారానికి 2 గుడ్లు.. ఎంత మేలు?

Advertisement

గుడ్డులో ‘కంప్లీట్ ప్రోటీన్’ ఉంటుంది. అంటే శరీరానికి కావలసిన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి. కనీసం వారానికి రెండు గుడ్లు తింటే.. అది పిల్లల కండరాల పెరుగుదలకు, కణాల మరమ్మతుకు తోడ్పడుతుదని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు సొనలో ఉండే ‘చోలిన్’ (Choline) అనే పోషకం.. పిల్లల జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే గుడ్డులోని విటమిన్-A, విటమిన్-D, జింక్ పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి కంటి చూపును మెరుగుపరుస్తాయని స్పష్టం చేస్తున్నారు.

గుడ్ల స్థానంలో శాఖాహారం

అయితే బెంగాల్ ప్రభుత్వం గుడ్లకు ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, రాజ్మా, పనీర్, సోయాబీన్ వంటి శాఖాహార పదార్థాలను ఇవ్వాలని యోచిస్తోంది. అయితే శాఖాహారం ద్వారా గుడ్డుతో సమానమైన పోషకాలను అందించడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శాఖాహారంలో ప్రోటీన్లు ఉన్నప్పటికీ వాటిని శరీరం పూర్తిగా గ్రహించే రేటు (Bioavailability) గుడ్డుతో పోలిస్తే తక్కువగా ఉంటుందని దిల్లీ గంగారామ్ ఆస్పత్రి న్యూట్రిషన్ విభాగం డాక్టర్ ఫరేహా షానమ్ స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు, సోయాబీన్ లేదా పప్పుల్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉన్నా గుడ్డులో దొరికే విటమిన్ B12 వంటి కొన్ని పోషకాలు శాఖాహారంలో సహజంగా లభించడం కష్టమని తెలియజేస్తున్నారు.

Advertisement

Also Read: ఈ సరికొత్త Xiaomi TV అడ్వాన్స్‌డ్ ఫీచర్లు చూసాక.. సాధారణ LED TV కొనాలనిపించదు.. ఎందుకంటే?

నిపుణులు ఏమంటున్నారు?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధ్యాహ్న భోజనంలో గుడ్లను తొలగించడం వల్ల పోషకాహార లోపంతో (Malnutrition) బాధపడే పేద విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ గుడ్లను పూర్తిగా భర్తీ చేయాలనుకుంటే ప్రభుత్వం కేవలం పప్పులకే పరిమితం కాకుండా.. ముడి శనగలు, పాలు, పనీర్ లేదా మల్టీ-గ్రెయిన్ ఆహార పదార్థాలను సమతుల్యంగా అందించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. మెుత్తంగా రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం విద్యార్థుల హాజరుపై వారి శారీరక ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Also Read: LG నుంచి IFB వరకు.. రూ.8,000 లోపే సామాన్యులు సైతం కొనదగ్గ బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లు ఇవే!

Related News

ఇండియన్ ఆయిల్ కంపెనీలో జాబ్స్.. రూ.1.60 లక్షల వరకు జీతం.. ఫ్రెషర్లకు మంచి అవకాశం

రూపాయికి ఇన్ని వస్తువులా? స్వాతంత్ర్యం నాటి నిత్యావసరాల ధరలు చూస్తే షాకవుతారు!

ఆగస్టు 15న కాదు.. ఆ రెండు ఆలయాల్లో 4 రోజుల ముందే స్వాతంత్ర వేడుకలు.. కారణం తెలిస్తే షాకే?

ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్‌లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!

బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు.. జెన్ జీ నిరసనలు తప్పవంటూ, అవినీతి 90 శాతం ఇంటర్వ్యూల్లో

‘నా దగ్గర బాంబు ఉంది’.. ప్రయాణికుడి వ్యాఖ్యతో.. విమానాశ్రయంలో రచ్చ రచ్చ!

ఆర్టికల్ 370 తీసేయకుంటే.. పీవోకే దేశంలో విలీనమయ్యేది.. జమ్ముూ కాశ్మీర్ సీఎం సంచలనం

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష హాట్ టాపిక్.. విజయ్ ప్రభుత్వం టాప్ ప్రయార్టీ

Big Stories

Advertisement
×