Hyderabad News: హైదరాబాద్‌లోని పట్టపగలు నడిరోడ్డుపై యువకులు రెచ్చిపోయారు. కారులో వెళ్తున్న యువకులు.. బైక్‌పై వెళ్తున్నవారిని క్రికెట్ బ్యాట్‌తో చావబాదారు. తమను రక్షించాలని వేడుకున్నా, ఏ ఒక్కరూ ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లోని బండ్లగూడ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తూ అనుకోకుండా కారుని ఢీకొట్టింది ఓ బైక్. ఆ తర్వాత బైక్ కొద్దిదూరం వెళ్లింది. ఈలోగా కారు.. ఆ బైక్‌ని చేంజ్ చేసి ఆపింది. తమ కారుని ఢీ కొడతారా అంటూ బైక్ రైడర్‌పై విరుచుకుపడ్డారు కారులోని కొందరు యువకులు.
ఈ క్రమంలో కారులోని యువకులు-బైక్ రైడర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కర్రలు-క్రికెట్ బ్యాట్లతో వారిపై విరుచుకుపడ్డారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న స్థానికులు చేరుకుని వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పట్టరాని కోపంతో క్రికెట్ బ్యాట్ తీసుకుని బైక్‌పైనున్న యువకులను చావబాదారు. దాడి జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ ద్వారా ఆ సన్నివేశాలను బంధించాడు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.దీనిపై నిరసన వ్యక్తమైంది.కారుపై ఏరియా సభ సభ్యుడు అనే స్టిక్కర్ ఉంది. దాడి యవ్వారం వైరల్ కావడంతో పోలీసుల దృష్టిలో పడింది. బండ్లగూడ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బైక్ వ్యక్తులపై దాడి చేసినవారిని గుర్తించేందుకు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించారు.
ALSO READ: దారుణం.. మూడేళ్ల కూతుర్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
దాడికి పాల్పడినవారెవరు? స్థానికులా? బయట నుంచి వ్యక్తులా? కారు నెంబరు మాత్రం తెలంగాణ పేరు మీద రిజిస్ట్రేషన అయ్యింది. ఆ వాహనం ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువకులు.. క్రికెట్ బ్యాట్లతో బైకర్స్‌పై దాడి
హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసిన ఘటన
బైక్‌పై వెళ్తూ అనుకోకుండా కారును ఢీకొట్టిన ఇద్దరు వ్యక్తులు
దీంతో కారులోంచి దిగిన కొందరు వ్యక్తులు ఆ బైకర్స్‌పై విచక్షణారహితంగా దాడి
కర్రలు,… pic.twitter.com/pZBY197KWC
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025