BigTV English

Upcoming Movies in June: తొలకరి జల్లుల వేళ.. ఇండస్ట్రీని హీటెక్కించడానికి సిద్ధమవుతున్న చిత్రాలివే..!

Upcoming Movies in June: తొలకరి జల్లుల వేళ.. ఇండస్ట్రీని హీటెక్కించడానికి సిద్ధమవుతున్న చిత్రాలివే..!

Upcoming Movies in June: ఈ సమ్మర్ కి పెద్ద హీరోల సినిమాలు వస్తాయని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ కొన్ని కారణాలవల్ల ఏ ఒక్క హీరో కూడా ఈ సమ్మర్ ను క్యాష్ చేసుకోలేకపోయారు. అయితేనేమి ఇప్పుడు జూన్ నెల ప్రారంభం కాబోతోంది. తొలకరి జల్లులు పడే మూమెంట్లో ఇండస్ట్రీని మరింత హీటెక్కించడానికి స్టార్ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతూ ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ అందివ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే మే 30 తేదీని మొదలుకొని జూన్ నెల ఆఖరి వరకు ఏ ఏ చిత్రాలు విడుదలవుతున్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.


మే 30 – భైరవం..

మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో కే.కే.రాధా మోహన్ నిర్మించారు. ఆనంది, అదితి శంకర్ , దివ్య పిళ్ళై హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో సక్సెస్ సాధించిన ‘గరుడన్’ సినిమాకు రీమేక్ గా తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ముగ్గురు మిత్రుల చుట్టూ సాగే యాక్షన్ కథగా ఈ సినిమా రూపొందించినట్లు సమాచారం.


జూన్ 5 – థగ్ లైఫ్..

కమల్ హాసన్ (Kamal Haasan), మణిరత్నం(Maniratnam ) కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్గా నటిస్తోంది. ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జూన్ 12 – హరిహర వీరమల్లు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా.. దాదాపు 13 సార్లు వాయిదా పడి, ఇప్పుడు జూన్ 12న విడుదలకు సిద్ధం అవుతోంది.

జూన్ 20 – కుబేర..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush ) హీరోగా, కింగ్ నాగార్జున (King Nagarjuna) ప్రధాన పాత్రలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar kammula)రూపొందిస్తున్న చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో నాగార్జున సిఐడి ఆఫీసర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జూన్ 25 – కన్నప్ప..

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా.. ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కన్నప్ప’. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు (Mohanbabu) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంచు విష్ణు, ప్రభాస్(Prabhas ), మోహన్ లాల్ (Mohan lal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal)ఈ సినిమాలో నటిస్తున్నారు.మొత్తానికి అయితే సమ్మర్ మొత్తం ఇండస్ట్రీ డల్ గా మారినా.. ఇప్పుడు జూన్ నెల ఆరంభం నుంచే వరుస సినిమాలు ఇండస్ట్రీని మరింత హీటెక్కించడానికి సిద్ధమవుతున్నాయి.

ALSO READ:Manchu Vishnu: సొంత తమ్ముడు మోసం చేశాడు.. నాకు ఇక అన్నీ ప్రభాసే..!

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×