Nalgonda Accident: లారీనీ ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఆర్టీసీ బస్సను ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 11 మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ నర్లక్ష్యంతోనే కారు డ్రైవర్ కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నమైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేస్తు.. ఎదురుగా వస్తున్న కారును అతివేగంగా ఢీ కొట్టింది. కారులో మొత్తం 11మంది ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. బస్ డ్రైవర్ తప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
మృతుల వివరాలు.. తొర్రూరు మండలం కాంటెయ్యపాలెం కి చెందిన గడ్డం రవీందర్ (34) అతని భార్య రేణుక (28), వారి కూతురు రిషిత(8) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు పిల్లల పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడంతో.. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరంతా ఆత్మకూరు (S) మండలం కోట పహాడ్ గ్రామంలో ఓ పండుగకు వచ్చి.. తిరిగి హైదరాబాద్ వెళ్లుచుండగా.. ఖమ్మం రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది .
మృతుడు రవీందర్ హైదరాబాద్‌లో నివాసం ఉంటూ.. సాఫ్ట్ వేర్ కంపెనీలో కార్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో గ్రామంలో ఒక పండుగ ఉందని.. కుటుంబ సభ్యులతో కలిసి నిన్న ఉదయం అక్కడికి వెళ్లారు. పండుగ ముగించుకుని మళ్లీ డ్యూటీకి వెళ్లాలి కాబట్టి.. సాయంత్రం హైదరాబాద్‌కు వెళుతున్న క్రమంలో సూర్యాపేట ఖమ్మం రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఓ బాలుడిని అనాథగా మిగిల్చింది. ఆత్మకూరు దగ్గర జరిగిన యాక్సిడెంట్‌లో అమ్మానాన్నతో పాటు అక్కను కోల్పోయాడు.
Also Read: హైదరాబాద్ లో దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దారుణ హత్య
ఇదిలా ఉంటే.. ఉప్పల్‌లో బీరప్పగడ్డ వద్ద ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న మినీ వ్యాన్ అటుగా వెళ్తున్న బాలికపైకి దూసుకు వచ్చింది. ఆ బాలిక త్రుటిలో తప్పించుకోగా మినీ వ్యాన్ ప్రక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది. తప్పుతనదేనని ఒప్పుకున్న డ్రైవర్ కరెంట్‌పోల్ పునరుద్ధరణకు అయ్యే ఖర్చుని చెల్లించి వెళ్లిపోయాడు. ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇలాంటి ఘటనల కారణంగా అమయాకుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని.. కావున వీరిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.