Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. సోమవారం ఉదయం చంపాపేట డివిజన్‌లో అడ్వకేట్ ఇజ్రాయెల్ దారుణహత్యకు గురయ్యాడు. దస్తగిరి అనే వ్యక్తి ఆయనను కత్తితో పొడిచి చంపేశాడు. బాధిత యువతికి అండగా నిలవడమే లాయర్ హత్యకు కారణంగా తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
లాయర్‌ని చంపేసిన ఎలక్ట్రిషియన్
హైదరాబాద్ సిటీలోని చంపాపేట్‌లోని యూ మారూతీ నగర్ ప్రాంతంలో అడ్వకేట్ ఇజ్రాయిల్ ఉంటున్నాడు. అదే ప్లాట్‌లో పై అంతస్తులో ఓ మహిళ ఉంటోంది. అయితే ఎలక్ట్రిషియన్ దస్తగిరి ఆమెని వేధించడం మొదలు పెట్టాడు. మొదట ఆ మహిళ లైట్‌గా తీసుకుంది. రోజురోజుకూ వాడి వేధింపులు తీవ్రం కావడంతో అడ్వొకేట్ ఎర్రబాపు ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది.
మహిళపై వేధింపులే అసలు కారణం
జరిగిన విషయమంతా చెప్పింది బాధిత మహిళ. అయితే బాధిత మహిళతో కలిసి సమీపంలోని పోలీసుస్టేషన్‌లో దస్తగిరిపై ఫిర్యాదు చేశాడు అడ్వొకేట్ ఇజ్రాయిల్.ఈ క్రమంలో లాయర్‌పై కక్ష పెంచుకున్నాడు దస్తగిరి. ఎలాగైనా ఆయనకు సరైన బుద్దిచెప్పాలని భావించాడు. సమయం కోసం వెయిట్ చేశాడు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నడిరోడ్డులో తనతో తెచ్చుకున్న కత్తితో ఇజ్రాయిల్ ని దారుణంగా హత్య చేశాడు దస్తగిరి.
లాయర్ ను కత్తితో నాలుగైదు పోట్లు పొడిచినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. స్పాట్‌లో కుప్పకూలిపోయాడు అడ్వకేట్. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి నిందితుడు దస్తగిరి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత నేరుగా ఐఎస్ సదన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ALSO READ: లారీని టేకోవర్ చేసిన బస్సు ఆపై కారుని ఢీ కొట్టంది
ఎఫైర్ కారణమా?
ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. అపార్టుమెంటులో ఉండే వాచ్‌మేన్ దంపతులకు ఓ పాప ఉంది. దస్తగిరి అనేవాడు ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. అదే సమయంలో వాచ్‌మెన్ భార్య దస్తగిరితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం అపార్టుమెంటులో ఉన్నవారికి తెలిసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
తన మీద ఎందుకు ఫిర్యాదు చేశారని లాయర్‌పై విరుచుకుపడ్డాడు దస్తగిరి. ఈ వ్యవహారం జరిగి కొద్దిరోజులపాటు ఆగ్రహంతో రగిలిపోయాడు. తన అంతర్గత విషయాన్ని బయటకు తెస్తారా అంటూ పలుమార్లు రుసరుసలాడారు. చివరకు సోమవారం ఉదయం లాయర్‌ని చంపేసి స్టేషన్‌లో లొంగిపోయాడు.
పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దారుణ హత్య
లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన ఎలక్ట్రీషియన్ దస్తగిరి
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయిల్ మృతి
ఓ మహిళను వేధిస్తున్న ఘటనలో దస్తగిరిపై ఫిర్యాదు చేసిన లాయర్ ఇజ్రాయిల్
ఈ క్రమంలోనే కక్ష పెంచుకుని ఇజ్రాయిల్‌పై… https://t.co/dJduvLXK9Y pic.twitter.com/qv2UQAaY7p
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2025