BigTV English

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Miss Universe -2025:ప్రతి ఏడాది దేశాలలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. అలా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ వంటి పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది ఇండియాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో రాజస్థాన్ బ్యూటీ మణికా విశ్వకర్మ (Manika Vishwakarma) కిరీటాన్ని అందుకుంది. మరి మిస్ యూనివర్స్ ఇండియా – 2025 కిరీటాన్ని గెలుచుకున్న మణిక విశ్వకర్మ బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..


మిస్ యూనివర్స్ మణికా విశ్వకర్మ బ్యాక్ గ్రౌండ్..

శ్రీ గంగానగర్ కి చెందిన మణికా విశ్వకర్మ ప్రస్తుతం ఢిల్లీలోనే సెటిల్ అయింది. ఆమె పొలిటికల్ సైన్స్ అలాగే ఎకనామిక్స్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.. మణిక విశ్వకర్మ ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు చిత్రలేఖనం, క్లాసికల్ డాన్స్ వంటి వాటిల్లో కూడా ప్రావీణ్యం పొందింది. అలా క్లాసికల్ డాన్స్ లో జాతీయ స్థాయిలో కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మణికా విశ్వకర్మ 2024 లో రాజస్థాన్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో కూడా టైటిల్ విన్ అయింది.. ఓవైపు చదువులు, మరోవైపు అందాల పోటీలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. అలా మణికా విశ్వకర్మ న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి ADHD వంటి న్యూరోలాజికల్ సమస్యలతో ఇబ్బందులు పడే ఎంతోమందికి తన వంతు సహాయం చేస్తోంది. అంతేకాకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే బిమ్స్ టెక్ సెవోకాన్ లో ఇండియా తరఫున మణికా విశ్వకర్మ ప్రతినిధిగా పాల్గొంది..


రెండు , మూడు స్థానాలలో నిలిచింది వీరే..

అలా తాజాగా మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం గెలుచుకోవడం కారణంగా మణికా విశ్వకర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది.. మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో కిరీటం అందుకోగా ఉత్తరప్రదేశ్ కి చెందిన తాన్య శర్మ మొదటి రన్నరప్ గా, మెహక్ ధింగ్రా రెండో రన్నరప్ గా నిలిచింది. అలాగే హర్యానాకు చెందిన అమిషి కౌశిక్ మూడో రన్నరప్ గా నిలిచారు.

త్వరలో థాయిలాండ్లో మిస్ యూనివర్స్ పోటీలు..

ఈ సంవత్సరం థాయిలాండ్ వేదికగా 74వ మిస్ యూనివర్స్ పోటీలు జరగబోతున్నాయి. అయితే ఈ మిస్ యూనివర్స్ పోటీలలో కూడా ఇండియా నుండి మణికా విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించబోతోంది.. ఇక మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గత ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెల్చుకున్న రియా సింఘా చేతుల మీదుగా అందుకుంది.

ఇప్పటివరకు అవార్డులు అందుకున్న ఇండియన్ సెలబ్రిటీస్..

అయితే ఇప్పటివరకు నిర్వహించిన అందాల పోటీలలో భారతదేశం ఇప్పటికే మూడుసార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. అలా సుస్మితా సేన్,లారా దత్తా, హర్నాజ్ సంధూ వంటి వాళ్ళు ఈ ఘనత సాధించారు. అలా సుస్మితాసేన్ 1994 లో, లారా దత్తా 2000 సంవత్సరంలో, హర్నాజ్ సంధూ 2021వ సంవత్సరంలో ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు.. కానీ గత సంవత్సరం ఇండియా తరపున ఈ మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న రియా సింఘా టాప్ 12 లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.కానీ డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కేజర్ ఈ అందాల పోటీలలో విజేతగా నిలిచింది. అయితే ఇప్పటివరకు డెన్మార్క్ దేశం నుండి ఇలాంటి ఘనత సాధించిన యువతి ఒక్కరు కూడా లేరు. కానీ ఫస్ట్ టైం విక్టోరియా కేజర్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఇక నవంబర్లో థాయిలాండ్ వేదికగా జరగబోయే 74వ మిస్ యూనివర్స్ పోటీలలో మణికా విశ్వశర్మ ఖచ్చితంగా మరోసారి భారత్ కి కిరీటాన్ని తీసుకు వస్తుందని పలువురు భావిస్తున్నారు.

ALSO READ:Nandamuri : నందమూరి ఇంటి విషాదం… జయకృష్ణ భార్య కన్నుమూత

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big Stories

×