Inter Student Suicide Case: బాచుపల్లి ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని పూజిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న పూజిత, రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం కాలేజీకు వెళ్లింది. అయితే ఆమె పేరెంట్స్ కు ఊహించని విధంగా కాలేజీ యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసి గాంధీ ఆసుపత్రికి రావాలని యాజమాన్యం చెప్పింది. దీంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు తొలుత పూజిత తల్లిదండ్రులకు కంగారు పడ్డారు.
పూజిత బాత్ రూమ్లో జారిపడి చనిపోయిందని యాజమాన్యం యువతి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో పూజిత తల్లిదండ్రులకు ఒక్కసారిగా షాకయ్యారు. ఉదయం కాలేజీకి వెళ్లిన కూతురు సాయంత్రానికి ఇంటికి తిరిగొస్తుందనుకున్నామని, గాంధీ ఆసుపత్రిలో మృతదేహాన్ని చూడాల్సి వస్తుందని తాము ఊహించలేకపోయామని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలాఉండగా పూజిత చనిపోయిన విషయం కళాశాల యాజమాన్యం తెలియ జేసిన తీరుపై సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి.
తొలుత బాత్ రూమ్‌లో జారిపడిపోయి చనిపోయిందని చెప్పారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారని పూజిత బంధువులు ఆరోపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగేశారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, పూజిత ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రిన్సిపల్ సమాచారం ఇచ్చారన్నారు. పూజిత రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆ లెటర్ లో వ్యక్తిగత విషయాలు చాలావరకు గుర్తించినట్టు తెలుస్తోంది.
పూజిత ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని తేలితే కఠినచర్యలు తప్పవంటున్నారు బాచుపల్లి సీఐ. మమత మెడికల్ కాలేజీ నుంచి ఎంఎల్ సీ వచ్చిందన్నారు. పోలీసులు అక్కడికి వెళ్లిన పరిశీలించిన తర్వాత డెడ్ బాడీని గాంధీకి షిఫ్ట్ చేశారని చెప్పుకొచ్చారు. దీనిపై యువతి పేరెంట్స్ సమాచారం ఇచ్చామని, కాలేజీ యాజమాన్యం కూడా వచ్చిందన్నారు. కొన్ని లేఖలు దొరికాయి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి సంబంధించిన వివరాలు చెబుతామని అంటున్నారు.
ALSO READ: భార్యపై అనుమానం.. ఫెవీక్విక్ గమ్‌తో దారుణమైన చర్య, ఇంత సైకోగాడా?
సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు-దేవి దంపతుల కూతురు పూజిత. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి బోరబండలో ఉంటోంది ఆ ఫ్యామిలీ. శ్రీనివాసరావు ఫ్యామిలీకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. పెద్ద కూతురు బీటెక్ చదువుతోంది. రెండో కూతురు పూజిత బాచుపల్లిలోని ఎస్‌ఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ లో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది.