Husband Seals Wife Fevikwik | చక్కని సంసారం, అందమైన భార్య జీవితం ఎంతో హాయిగా గడపాల్సిన ఓ యువకుడు అనుమానం అనే పెనె భూతాని బానిసయ్యాడు. ఎక్కడ లేని అనుమానాలతో తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. ఆమెకు ఇతర పురుషులతో అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తూ తరుచూ కొట్టేవాడు. కానీ ఇటీవల అతనిలోని పైశాచికత్వం హద్దులు దాటింది. భార్యను చితకబాది ఆమె పెదాలకు ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరం నేలమంగల తాలూకా హారోక్యాతనహళ్లి ప్రాంతానికి చెందిన సిద్దలింగయ్య (35)కి పదేళ్ల క్రితం మంజుల (31) అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లి అయిన మొదటి రెండు సంవత్సరాలు అంతా బాగానే ఉండేది. కానీ మంజులతో ఇతర పురుషులు ఎవరు సన్నిహితంగా మాట్లాడినా సిద్దలింగయ్యకు నచ్చేది కాదు. దీంతో తరుచూ ఆమెను దూషించేవాడు. అతని ఆవేశం కాస్తా పెరుగుతూ వచ్చింది. క్రమంగా భార్యపై అనుమానంతో ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆమె బంధువులుతో మాట్లాడినా సిద్దలింగయ్య సహించేవాడు కాదు. ఈ కారణంగా పలుమార్లు ఆమె కుటుంబ పెద్దలను ఆశ్రయించింది. అయినా సిద్దలింగయ్యలో ఏ మార్పు రాలేదు.
ఇటీవల మంజుల బంధువులలో తన సోదర వరుస అయిన ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సిద్దలింగయ్య ఇంట్లో లేడు. దీంతో ఆ బంధువుతో ఇంట్లో మంజుల మాట్లాడుతూ ఉండగా.. సిద్దలింగయ్యా రానే వచ్చాడు. ఆ తరువాత తను ఇంట్లో లేని సమయంలో ఇలా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావని ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ కారణంగా మంజుల కూడా అతడిని ప్రతిఘటించింది. దీంతో సిద్దలింగయ్య ఆమెను చితకబాదాడు. ఆ దెబ్బలకు మంజుల అరుస్తుండడంతో ఆమె పెదాలకు ఇంట్లో కనిపించిన ఫెవిక్విక్ తో సీల్ చేశాడు. ఆ తరువాత భర్త కొట్టిన దెబ్బలకు మంజుల స్పృహ తప్పిపడిపోయింది. భార్య చనిపోయిందేమోనని సిద్దలింగయ్య అక్కడి నుంచి పరారయ్యాడు.
Also Read: ఆస్పత్రి వద్ద పసికందుని పీక్కుతిన్న కుక్కలు.. తల్లిదండ్రులదే తప్పంటున్న వైద్యులు
మంజుల స్నేహితురాలు అయిన పక్కింటి యువతి సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే.. ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయి. మంజుల అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో మంజులను ఆంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గృహహింస కేసు నమోదు చేసుకొని సిద్దలింగయ్య కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం సిద్దలింగయ్య పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ఇలాంటిదే మరో కేసు ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో రెండు రోజుల క్రితం జరిగింది. రాష్ట్రానికి చెందిన శ్యామలదాస్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన భార్య స్వప్న (35)తో గత సోమవారం గొడవపడ్డాడు. ఆ రోజు సాయంత్రం స్వప్నకు ఆవేశంలో కొట్టాడు. పరాయి పురుషులతో ఆమె మాట్లాడడం అతని నచ్చదని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినకపోవడంతో శ్యామల్ దాస్ ఆమెను చితకబాదాడు. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగిలి మరణించింది.
భార్య చనిపోయిన తరువాత శ్యామల్ దాస్ భయపడి పోయి.. ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఉండిపోయాడు. భార్య శవంతో రాత్రంతా గడిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తన భార్యను ఎవరో హత్య చేసి వెళ్లిపోయారని బుకాయించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించాక అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం శ్యామల్ దాస్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.