Bank Robbery: ఇంటి నుంచి డబ్బులతో బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా జేబులే కాదు పర్సులు కనిపించవు. అలాంటి ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఏకంగా ఐదు లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. ఇంతకీ దొంగ ఎవరో తెలుసుకుని అధికారులు షాకయ్యారు. డీటేల్స్‌లోకి వెళ్దాం.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎస్‌బీఐ బ్యాంకులో ఐదు లక్షలు రూపాయలు చోరీ అయిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈనెల 8న ఓ కస్టమర్ ఐదు లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత కస్టమర్ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే కొద్దిసేపటి తర్వాత క్యాషియర్ వద్ద ఆ నగదు కనిపించకుండా పోవడంతో సిబ్బంది షాకయ్యారు.
తొలుత బ్యాంక్ అంతా వెతికారు సిబ్బంది. ఎక్కడా ఒక్క రూపాయి కనిపించలేదు. క్యాషియర్ దగ్గరున్న నగదు పలుమార్లు చెక్ చేశారు. అక్కడా ఐదు లక్షలు కనిపించలేదు. చివరకు బ్యాంకు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తొలుత బ్యాంకు సిబ్బందిని అన్ని కోణాల్లో ప్రశ్నించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు.
ముగ్గురు దొంగలు ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. దుండగులు పక్కాగా స్కెచ్ వేసినట్టు రంగంలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు. చోరీకి పాల్పడినవారిలో 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. వాడే ఆ దొంగతనం చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు లోతుగా చేస్తున్నారు.
ALSO READ: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. కాళ్లు నరికి, రైల్వే పట్టాలపై
ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి బ్యాంకులో అనుమానాస్పదంగా సంచరించినట్టు కనిపించారు. ఇంతకీ ఆ దొంగలు ఎవరు? స్థానికంగా ఉండేవారా? లేకుంటే బయటి నుంచి వచ్చారా? కస్టమర్ డబ్బుల గురించి వారికి ముందే తెలుసా? ఇలాంటి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
సీసీఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. అయినా క్యాషియర్ నుంచి డబ్బులు కొట్టేయడమేంటి? నార్మల్‌గా క్యాష్ చెక్ చేసిన తర్వాత లోపల పెడతారు. మరి ఎస్బీఐలో క్యాషియర్ ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.