BigTV English

Munnar: మున్నార్ కు అరుదైన ఘనత, ఆసియాలో బెస్ట్ రూరల్ టూరిస్ట్ ప్లేస్ గా గుర్తింపు!

Munnar: మున్నార్ కు అరుదైన ఘనత, ఆసియాలో బెస్ట్ రూరల్ టూరిస్ట్ ప్లేస్ గా గుర్తింపు!

Asia Best Rural Escapes 2025:

కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా నిత్యం వేలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఇండియాలోని బెస్ట్ హిల్ స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న మున్నార్.. ఇప్పుడు మరో ఘనత సాధించింది. 2025 సంవత్సరానికి ఆసియాలోని టాప్ రూరల్ డెస్టినేషన్స్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ అగోడా ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. రోలింగ్ టీ తోటలు, పొగమంచుతో కప్పబడిన లోయలు, చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన మున్నార్,  ప్రకృతి అన్వేషకులు ఎంతగానో ఇష్టపడుతారు. తాజా నివేదిక ఆసియాలోని ఎనిమిది బెస్ట్ రూరల్ డెస్టినేషన్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం సహజ ఆకర్షణ, ప్రశాంతమైన వెదర్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


మున్నార్ ప్రత్యేకత ఏంటి? 

పశ్చిమ కనుమలలో ఉన్న మున్నార్ టీ తోటలు, కొండలు, లోయలు, జలపాతాలతో కనువిందు చేస్తుంది. ట్రెక్కింగ్, పక్షుల సందడి, బోటింగ్ లాంటి సాహస క్రీడలకు అనుకూలంగా ఉంటుంది. అరుదైన నీలకురింజి పువ్వుకు నిలయం. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వికసించి కొండలను నీలిరంగులోకి మారుస్తుంది. ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు ఎక్కువగా పర్యాటకులు తరలి వస్తారు.

మున్నార్‌ లో చూడాల్సిన ప్రత్యేక ఆకర్షణలు 

⦿ ఎరవికులం నేషనల్ పార్క్: అంతరించిపోతున్న నీలగిరి తహర్, అనముడి శిఖరం అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది.


⦿ మట్టుపెట్టి డ్యామ్: దట్టమైన కొండలు, టీ తోటల మధ్య ఉన్న ఈ ప్రసిద్ధ బోటింగ్ ప్రదేశం అందరినీ ఆకట్టుకుంటుంది.

⦿ టీ తోటలు, టాటా టీ మ్యూజియం: మున్నార్ అంతా ఆకుపచ్చగా కనువిందు చేస్తుంది. టీ సాగు వారసత్వాన్ని గుర్తించే మ్యూజియం ఆకట్టుకుంటుంది.

⦿ టాప్ స్టేషన్: విశాలమైన లోయ దృశ్యాలను ఇక్కడి నుంచి చూసే అవకాశం ఉంటుంది.

⦿ అట్టుకల్ జలపాతాలు: అందంమైన జలపాతాలను చూస్తూ ప్రశాంతమైన విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్రాంతం ఎంతో ఉపయోగపడుతుంది.

మున్నార్ సందర్శించడానికి బెస్ట్ టైమ్

సంవత్సరంలో ఎక్కువ భాగం మున్నార్‌ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సెప్టెంబర్, మార్చి మధ్య సందర్శించడానికి బెస్ట్ టైమ్ గా చెప్పుకోవచ్చు. దేశంలోని ఇతర ప్రాంతాలలో వేసవి (ఏప్రిల్-జూన్)హిల్ స్టేషన్ల మాదిరిగానే ఈ హిల్ స్టేషన్ కు కూడా పెద్ద సంఖ్యలో పర్యటలకులు తరలి వస్తారు. అయితే వర్షాకాలం (జూలై-ఆగస్టు) భారీ వర్షాలు వస్తాయి. వర్షాల నడుమ కొండలు మరింత ఆకుపచ్చగా, అందంగా కనిపిస్తాయి.

మున్నార్ కు ఎలా వెళ్లాలంటే..

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన సర్వీసులు ఉంటాయి. ఇక్కడి నుంచి సుమారు 110 కి.మీ దూరంలో మున్నారు ఉంటుంది. బస్సు, టాక్సీ, ప్రైవేట్ కారు ద్వారా అక్కడికి వెళ్లొచ్చు.

ఆసియాలోని టాప్ 8 రూరల్ డెస్టినేషన్స్ లిస్ట్:

అగోడా విడుదల చేసిన ఈ లిస్టు గ్రామీణ పర్యాటక రంగంపై పెరుగుతున్న ఆసక్తిని హైలైట్ చేసింది. మున్నార్ ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో మొత్తం8 ప్రాంతాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

1.కామెరాన్ హైలాండ్స్, మలేషియా

2.ఖావో యాయ్, థాయిలాండ్

3.పున్‌ కాక్, ఇండోనేషియా

4.ఫుజికావాగుచికో, జపాన్

5.కెంటింగ్, తైవాన్

6.సాపా, వియత్నాం

7.మున్నార్, భారత్

8.ప్యోంగ్‌ చాంగ్, దక్షిణ కొరియా

Read Also: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

Hyderabad Metro: మెట్రో నిర్వహణ భారం అవుతుంది.. కేంద్రానికి L&T లేఖ

Fstest Train: ఇండియాలో వందే భారత్ రైళ్లే బాగా స్పీడ్ అనుకుంటిరా? కాదు.. ఈ రైలే అత్యంత స్పీడ్!

Flight Services: ముందు ఎయిర్ ఎయిర్ ఇండియా, తర్వాత ఇండిగో.. నేపాల్ మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభం!

Rajdhani Express: ఆరేళ్ల తర్వాత మళ్లీ రాజధాని ఎక్స్‌ ప్రెస్ ఎంట్రీ, ఏ రూట్ లో అందుబాటులోకి వస్తుందంటే?

Trains Stoppage: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఇక ఆ రైళ్లూ మల్కాజ్‌ గిరిలో ఆగుతాయట!

New Trains: వందేభారత్, అమృత్ భారత్ సహా 4 కొత్త రైళ్లు.. ప్రధాని మోడీ చేతలు మీదుగా ప్రారంభం!

Mizoram Train: ఐజ్వాల్ కు తొలి రైలు.. జెండా ఊపి ప్రారంభించబోతున్న ప్రధాని మోడీ!

Big Stories

×