BigTV English

Wedding Gun firing: పెళ్లిలో అతిథులపై కాల్పులు.. ఒకరు మృతి ఇద్దరికి గాయాలు.. అమెరికాలో మాస్టర్‌మైండ్

Wedding Gun firing: పెళ్లిలో అతిథులపై కాల్పులు.. ఒకరు మృతి ఇద్దరికి గాయాలు.. అమెరికాలో మాస్టర్‌మైండ్

Wedding Gun firing| ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో కొందరు దుండగలు దూసుకొచ్చి.. డిన్నర్ చేస్తున్నఅతిథులపై కాల్పులు చేశారు. దీంతో పెళ్లిలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కాసేపు ముందు వరకు సంతోషంగా ఉన్న వాతావరణం అంతా రక్తపాతం జరగడంతో విషాదంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కాల్పుల వెనుక కుట్ర చేసిన వ్యక్తి అమెరికాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన హర్యాణా రాష్ట్రంలో జరిగింది.


హర్యాణాలోని రోహ్‌తక్ నగరంలో రెండు రోజుల క్రితం రాత్రి పెళ్లి ఫంక్షన్ జరిగింది. ఈ పెళ్లి కార్యక్రమంలో పొరుగు జిల్లా ఝాజ్జర్ డిగల్ గ్రామం నుంచి పెళ్లికొడుకు వారు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ తరువాత పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికొడుకు స్నేహితులు మంజీత్, మందీప్ పెళ్లికి విచ్చేసి డాన్సులు చేశారు. ఆ తరువాత ఇద్దరూ డిన్నర్ చేస్తుండగా.. ఒక్కసారిగా కల్యాణ మండపంలో ఒక బ్లాక్ కలర్ స్కార్పియో కారు వచ్చింది. అందులో నుంచి నలుగురు యువకులు తుపాకులతో వచ్చారు.

Also Read: ఆస్తి నాకు వచ్చేసింది.. 85 ఏళ్ల ప్రియుడు చనిపోతున్నాడని డాన్స్ చేసిన యువతి..


వచ్చీ రాగానే ఆ యువకులు నేరుగా మంజీత్, మందీప్ డిన్నర్ టేబుల్ వద్దకు వెళ్లి.. వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ముందుగా మంజీత్ ను టార్గెట్ చేస్తూ కాల్పుల చేశారు. దీంతో మంజీత్ తల, చేతి, ఛాతి భాగాలపై బుల్లెట్లు తగిలాయి. పక్కనే కూర్చొని ఉన్న మందీప్ కు కాలిలో బుల్లెట్ గాయాలయ్యాయి. వారి వెనుక నిలబడి మరో వ్యక్తికి కూడా నడుము భాగంలో బుల్లెట్ తగిలింది.

ఈ ఘటనలో మంజీత్ అక్కడికక్కడే మరణించాడు. పెళ్లిలో నుంచి అతిథులంతా పరుగులు తీశారు. ఆ తరువాత కాల్పులు జరిపిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మంజీత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కాల్పులు జరిపిన ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

పోలీసులు విచారణలో ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. మృతుడు మంజీత్ అహ్లావత్ ఇంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేసేవాడని.. ప్రస్తుతం ఉద్యోగం మానేసి.. ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటున్నాడు. మంజీత్ కు పెళ్లి కొడుకు తమ్ముడి వరుస కావడంతో పెళ్లిలో అతిథిగా వచ్చాడు.

హర్యాణాకు చెందిన ఒక ప్రముఖ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు ఈ కాల్పులు జరిపించారు. గ్యాంగ్‌స్టర్ హిమాన్షు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడని.. అతను అక్కడి నుంచి ఆదేశిస్తే.. అతని గ్యాంగ్ షూటర్లు ఎవరిపై నైనా కాల్పులు చేస్తారు. ఢిల్లీ, హర్యాణా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇలాంటి చాలా కాల్పుల ఘటనల వెనుక గ్యాంగ్‌స్టర్ హిమాన్షు సూత్రధారిని పోలీసులు తెలిపారు.

గ్యాంగ్‌స్టర్ హిమాన్షు గురించి కొన్నేళ్ల తొలిసారిగా హర్యాణాలోని గొహానా నగరంలో ఒక స్వీట్ షాపు ఓనర్ పై కాల్పుల కేసులో నిందితుడిగా పేరు నమోదైంది. ఆ తరువాత నుంచి అతను యువకులకు డబ్బులు ఆశచూపి తన గ్యాంగ్ లో సభ్యులుగా చేర్చుకుని వారి చేత హత్యలు చేయించడం మొదలపెట్టాడు. చాలా హత్యల కేసులో హిమాన్షు గ్యాంగ్ బహిరంగంగా తామే ఈ హత్యలు చేశామని ప్రకటించడం గమనార్హం.

హిమాన్లు లాంటి ఇతర గ్యాంగ్ స్టర్లందరూ అమెరికా, కెనెడా, దుబాయ్ లాంటి దేశాల్లో పౌరసత్వం పొంది అక్కడి నుంచి సోషల్ మీడియా ద్వారా ఆదేశాలిస్తే.. భారతదేశంలో వారి గ్యాంగ్ షూటర్లు హత్యలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×