Allu Arjun: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి అల్లు అర్జున్‌పై ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు అంటూ బాగా ఫోకస్ పెట్టారు. తాజాగా బన్నీ ఆసుపత్రిలో కనిపించేసరికి తనకు ఏమైనా అయ్యిందా, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడా అంటూ ఫ్యాన్స్ డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో తన టీమ్ నుండి ఒక వ్యక్తి అసలు ఏం జరిగింది, అల్లు అర్జున్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడో సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అసలు విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు.
అందుకే వెళ్లాడు
అల్లు అర్జున్ నాన్నమ్మ, రామ్ చరణ్‌కు అమ్మమ్మ అయిన కనకరత్నం.. కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఈమధ్య ఆమె ఆరోగ్య సమస్యలు ఎక్కువవ్వడంతో తనను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని సమాచారం. నాన్నమ్మ ఆరోగ్యం ఎలా ఉందో చూడడానికి అల్లు అర్జున్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తల్లే కనకరత్నం. ప్రస్తుతం ఆమె వయసు 95 ఏళ్లు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని టాలీవుడ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్లింది తన నాన్నమ్మను చూడడానికే అన్న విషయం క్లారిటీ వచ్చేసింది.
అతిపెద్ద హిట్
కనకరత్నంను ఆసుపత్రిలో చూడడానికి ఇంకా మెగా ఫ్యామిలీ ఎవరూ రాలేదు. ముందుగా అల్లు అర్జునే ఆసుపత్రికి చేరుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో ఈ వీడియో బయటపడింది. అల్లు అర్జున్ చివరిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ఫ 2’ సినిమాతో అలరించాడు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పెద్ద హిట్ అయ్యింది. పైగా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా సాధించని కలెక్షన్స్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో పాటు ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. అలా ‘పుష్ప 2’ హిట్ అవ్వడంతో దీని తర్వాత బన్నీ స్టెప్ ఏంటి అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: రమా రాజమౌళికి మాత్రమే నచ్చిన సినిమాలేంటో తెలుసా.?
ఇంకా వెయిటింగ్
ప్రస్తుతం ఏ పాన్ ఇండియా హీరో అయినా ఒక సినిమా పూర్తి అవ్వక ముందే ఇద్దరు, ముగ్గురు దర్శకులను లైన్‌లో పెడుతున్నారు. అంతే కాకుండా మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే పెద్దగా బ్రేకుల్లేకుండా మరొక మూవీ సెట్‌లో అడుగుపెట్టేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం అలా చేయడం లేదు. సుకుమార్‌తో చేసిన ‘పుష్ప’ ఫ్రాంచైజ్ కోసమే తను దాదాపు నాలుగేళ్లు కేటాయించాడు. ‘పుష్ప’ తర్వాత దాని సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి తనకు మూడేళ్లు పట్టింది. ఇప్పుడు కూడా తన తరువాతి సినిమా డైరెక్టర్ ఎవరూ అనే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు అల్లు అర్జున్. కానీ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మాత్రం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ ఫిక్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
#AlluArjun నానమ్మ #RamCharan అమ్మమ్మ గారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ ట్రీట్ మెంట్ లో ఉన్నారు.#AlluAravind గారి మదర్ (వయసు 95)
— basavaraju ilapakurthi (@basavaraju_07) March 23, 2025