E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. రూ. 2.6 కోట్ల విలువైన గాంజా స్వాధీనం

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. రూ. 2.6 కోట్ల విలువైన గాంజా స్వాధీనం
Advertisement

Kothagudem: సినిమా స్టైల్‌ను కాపీ కొడుతూ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు స్మగ్లర్లు. ‘పుష్ప’ సినిమాలో లారీలో సీక్రెట్ క్యాబిన్ ఏర్పాటు చేసి ఎర్రచందనం తరలించినట్లుగానే.. ఇక్కడ లారీలో ప్రత్యేక అరను సిద్ధం చేసి భారీగా గంజాయిని రవాణా చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో రూ. 2.6 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది.

ఐటీసీ వెస్ట్ గేట్ వద్ద హైడ్రామా

Advertisement

ఒడిశా-తెలంగాణ సరిహద్దుల గుండా గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో పోలీసులు, ఈగల్ టీమ్ నిఘా పెట్టారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక అనుమానాస్పద కంటైనర్ లారీని ఆపి తనిఖీ చేశారు. పైకి సాధారణంగానే కనిపించినా, లోపల నిశితంగా పరిశీలించగా లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అర బయటపడింది. ఆ అరలో దాచిన 525 కేజీల గంజాయిని చూసి అధికారులు సైతం విస్తుపోయారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 2.625 కోట్లు ఉంటుందని అంచనా.

Also Read: రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

Advertisement

ఒడిశా నుంచి యూపీకి కనెక్షన్

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ గంజాయి నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు విషయాలు వెలుగుచూశాయి. ఒడిశాలోని అల్లూరి కోట అటవీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని సేకరించి, ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ముఠాలోని మరో నలుగురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు.

సీజ్ చేసిన వస్తువులు

నిందితుల నుంచి గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన కంటైనర్ లారీ, ఒక బజాజ్ పల్సర్ బైక్, ఐదు మొబైల్ ఫోన్లు మరియు రూ. 10,570 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!

Murder Case: ప్రియుడితో కలిసి భార్య దారుణం.. నిద్రిస్తున్న భర్తపై రుబ్బురోలు రాయితో దాడి..!

గన్నవరం బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు!

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఓ ఇల్లు.. స్పాట్‌లో!

కడదాకా ఉండాల్సిన ఇల్లాలు.. కసాయిగా మారింది.. వివాహేతర సంబంధం చిచ్చు.. దేవరకద్ర మండలంలో దారుణం!

హోమ్‌ స్టేలో ఏం జరిగింది? ఫిజియో థెరపిస్ట్ అనుమానాస్పద మృతి, ప్రియుడు మాటేంటి?

పల్నాడు జిల్లాలో దొంగల బీభత్సం.. 56 తులాల బంగారం చోరీ!

Big Stories

×