Ghaziabad News: ఆర్డర్ చేసిన ఫుడ్ రావడం ఆలస్యం అయ్యింది. ఆగ్రహంతో రగిలిపోయారు కొందరు యువకులు. ఏకంగా రెస్టారెంట్‌ని ధ్వంసం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిటీలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో అప్ని రసోయ్ ఫేమస్ రెస్టారెంట్ ఉంది. అక్కడకు ఫ్యామిలీలతో వస్తుంటారు. శనివారం రాత్రి సుమారు 11.30 నిమిషాల సమయంలో కొందరు యువకులు ఆ రెస్టారెంట్‌కు వచ్చారు. వారికి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ చేసిన ఫుడ్ రావడం ఆలస్యం అయ్యింది. వెంటనే ఆ యువకులు హోటల్ సిబ్బందితో గొడవపడ్డారు.
చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆ యువకులు కొంతమంది మోటారు సైకిళ్లపై వచ్చారు. వారిలో ఇనుప రాడ్లు, చైనులు ఉన్నాయి. కొందరు రెస్టారెంట్ బయట డ్యామేజ్ చేస్తుండగా, మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఇనుప రాడ్లతో ఎల్‌ఈడీ స్క్రీన్, బిల్లింగ్ మిషన్‌ను ధ్వంసం చేశారు.
ఇక ఫర్నీచర్ గురించి అడగాల్సిన అవసరం లేదు. టేబుళ్లపై దాడి చేశారు. కొంతమంది వ్యక్తులపై కుర్చీలను ఎత్తి పగలగొట్టారు. వివిధ వంటకాలతో వడ్డించిన టేబుల్‌పై చాలా మంది కుర్చీని ఉన్నారు. ఆ వ్యక్తులు నగదు కౌంటర్‌పై దాడి చేశారు. అందులో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లారు. హోటల్ విధ్వంసం సమయంలో పలు ఫ్యామిలీలు కుటుంబాలతో ఆ రెస్టారెంట్‌కు వచ్చాయి.
ALSO READ: ఇంటర్ స్టూడెంట్ హత్య వెనుక అసలు నిజాలు
యువకులు ధ్వంసం చేస్తున్నప్పుడు వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఈ వ్యవహారం హోటల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనపై హోటల్ యజమాని అక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలింపు చేపట్టారు.
ఈ ఘటనపై ఏసీపీ పూనమ్ మిశ్రా రియాక్ట్ అయ్యారు. ఇది హింసాత్మక కేసు అని అన్నారు. దోషులను పట్టుకుని రెస్టారెంట్ యజమానికి న్యాయం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. హోటల్ డ్యామేజ్ దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి హింసను ఖండిస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ సిబ్బంది, కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు భద్రత ఇవ్వాలని అంటున్నారు. లేకుంటే యువకులు ఈ విధంగా రెచ్చపోయే అవకాశముందని అంటున్నారు.
In UP's Ghaziabad, customers dining at a restaurant ran for cover as goons unleashed hell. At least half -a-dozen, armed miscreants could be seen vandalising furniture, glass and attacking customers. All this over a dispute on food bill. pic.twitter.com/z6ICm3N07z
— Piyush Rai (@Benarasiyaa) June 8, 2025
ये हे जिला गाजियाबाद।
थाना नंदग्राम क्षेत्र।
राजनगर एक्सटेंशन अपनी रसोई नाम के इस रेस्टोरेंट में उस समय बदमाशों ने फायरिंग और तौड़फोड़ की जब लोग खाना खा रहे थे।
सोचिए इस तस्वीर को देखने के बाद लगता है कि पुलिस का ख़ौफ़ कितना हे?@dgpup @Uppolice @myogiadityanath pic.twitter.com/IvmEDhfmWK
— Shakti Singh/शक्ति सिंह (@singhshakti1982) June 8, 2025