HHVM: హరిహర వీరమల్లు (Harihara Veeramallu).. చాలా ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నుంచి రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా 2021లోనే ప్రారంభం అయింది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా ఈ సినిమా ప్రకటించారు. అయితే మధ్యలో కరోనా రావడం, లాక్ డౌన్ విధించడం, ఫలితంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయాడు. దీంతో మధ్యలోనే క్రిష్ సినిమా నుండి తప్పుకున్నారు.
పవన్ కళ్యాణ్ మూవీ కోసం భారీ ఎదురుచూపు..
ఈ సినిమా బాధ్యతలను ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna)తీసుకోవడం జరిగింది. ఇక ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ డేట్స్ సాధించిన జ్యోతి కృష్ణ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ను మొదటి భాగంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ మొదటి భాగం కోసమే అభిమానులు ఇటు సినీ సెలబ్రిటీలు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా అభిమానులకే కాదు స్టార్ హీరోలకు, హీరోయిన్లకు కూడా ఎంతో ఇష్టం. ఇక ఆయన నుంచి సినిమా వస్తోంది అంటే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. అలాంటిది పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
హరిహర వీరమల్లు విడుదల పై నెలకొన్న సందిగ్ధత..
అభిమానులు ఎదురుచూసే కొద్దీ సినిమా విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. అలా దాదాపుగా ఇప్పటివరకు 14 సార్లు ఈ సినిమా వాయిదా పడింది. ఇక జూన్ 12న కచ్చితంగా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. మరో మూడు రోజుల్లో సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. ఇక అటు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కింగ్డమ్ మూవీ జూలై 4వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమాను పోస్ట్ పోన్ చేయించి ఆ సినిమా స్థానంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ చేయాలి అని త్రివిక్రమ్ (Trivikram )గట్టిగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికి తోడు జూన్ 12న విడుదల చేయకపోతే ఓటీటీ డీల్ లో కూడా కోత విధిస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించినట్టుగానే.. ఇప్పుడు రూ.20 కోట్ల మేరా కోత విధించినట్లు సమాచారం.
also read:Kollywood: మళ్లీ కలిసిన కమల్ – శంకర్.. నిర్మాతను ముంచడమే ధ్యేయమా?
మరో 65 ఏళ్ల తర్వాతే విడుదల కానుందా?
ఇక ఎప్పుడు విడుదలవుతుంది అని అభిమానులు సహనం కోల్పోతున్న వేళ.. తాజాగా ఒక వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. హరిహర వీరమల్లు సినిమా 2090 జనవరి 1వ తేదీన విడుదల కాబోతోంది అంటూ ఒక డిస్ట్రిక్ట్ యాప్ లో పొందుపరచడం సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఒక ట్విట్టర్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజెన్స్ అప్పటివరకు ఉండేదెవరు? ఊడేదెవరు?.. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మరో 65 ఏళ్ల వరకు హరిహర వీరమల్లు సినిమా విడుదల కాదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో ఫ్యాన్స్ ఇక ఆశలు వదులుకోండి.. 65 ఏళ్ల తర్వాతే సినిమా రిలీజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా దీనిపై చిత్ర బృందం స్పందిస్తుందేమో చూడాలి.
District App updated Hari Hara Veera Mallu release date as 1st Jan 2090!!#PawanKalyan | #HHVM pic.twitter.com/M4fCsYsNIh
— Movies4u Official (@Movies4u_Officl) June 8, 2025