E-Paper
Advertisement

MAD Juniors : ఇంకా ఆ మ్యాడ్ నుంచి ఈ దర్శకుడు బయటకు రాడా?

MAD Juniors : ఇంకా ఆ మ్యాడ్ నుంచి ఈ దర్శకుడు బయటకు రాడా?
Advertisement

MAD Juniors : జాతి రత్నాలు సినిమా తర్వాత సినిమా తీసే విధానం కూడా కొంతమంది దర్శకులు మార్చేసుకున్నారు. కేవలం కథకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా వినోదాన్ని నమ్ముకుని కూడా ప్రూవ్ చేసుకున్న వాళ్లు ఉన్నారు. జాతి రత్నాలు సినిమాకి రైటర్ గా కూడా వర్క్ చేశాడు కళ్యాణ్ శంకర్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు సినిమా వస్తుంది అని అప్పట్లో అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా జరగలేదు. కానీ అనౌన్స్మెంట్ టీజర్ మాత్రం విపరీతమైన హై క్రియేట్ చేసింది.

 

Advertisement

ఆ తర్వాత నవీన్ కు ఒక యాక్సిడెంట్ జరగడంతో సంవత్సరం పాటు సినిమాలకు దూరమయ్యాడు. మ్యాడ్ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడుగా పరిచయం అయిపోయాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. జాతి రత్నాలు మాదిరిగానే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమా తర్వాత మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా చేశాడు కళ్యాణ్ శంకర్. సినిమాకి ఊహించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.

మ్యాడ్ జూనియర్స్ 

ఇక ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ జూనియర్స్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి అందరూ కొత్త ఆర్టిస్టులు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఇది కూడా కామెడీ జోనర్ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి త్వరలో అనౌన్స్మెంట్ రానుంది.

Advertisement

అయితే ఈ విషయం తెలిసిన చాలామంది ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ మొదలుపెట్టారు. దర్శకుడు మ్యాడ్ నుంచి ఇంకా బయటికి రాడా? వేరే హీరోలతో సినిమా చేయడం అంటూ డిస్కషన్. మరోవైపు కార్తీ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే దాని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఒకవేళ అదే నిజమైనట్లయితే మంచి డెసిషన్ అని చెప్పాలి.

రవితేజ హీరోగా 

మరోవైపు రవితేజ హీరోగా కళ్యాణ్ శంకర్ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ లో భాను బోగవరపు దర్శకత్వంలో వచ్చిన మాస్ జాతర సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. అది సాధించకపోవడం వల్లనే రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ లో కాకుండా వేరే బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం రవితేజ తిరుమల కిషోర్ దర్శకత్వంలో భక్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నాడు.

మరోవైపు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో డబుల్ ధమాకా సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీలా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం.

Also Read: Surender Reddy : పవన్ కళ్యాణ్ కోసం రెండు పవర్ఫుల్ స్క్రిప్ట్స్, రంగంలోకి దిగిన వక్కంతం వంశీ

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×