BigTV English

Policeman Son Steals Car | దొంగతనం జరిగిన కారు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభ్యం!.. ఏం జరిగిందంటే?

Policeman Son Steals Car | దొంగతనం జరిగిన కారు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభ్యం!.. ఏం జరిగిందంటే?

Policeman Son Steals Car | శుక్రవారం అర్ధరాత్రి క్రేటా కారులో వెళుతున్న ఓ వక్తిని దారిలో ముగ్గురు దుండగులు అడ్డగించారు. ఆ తరువాత అతడి తలపై బలంగా కొట్టి.. తుపాకులు చూపించి కారుని దొంగలించారు. కారు యజమాని దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు 24 గంటల్లోనే ఆ ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. కానీ ఆ కారు వారికి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో లభించింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని భటిండా నగరంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. భటిండా నగరం మోడల్ టౌన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వికాస్ శర్మ, అమన్ చావ్లా, దీపక్ శర్మ.. ఈ ముగ్గురు కలిసి దారిలో వెళుతున్న కొత్త క్రేటా కారుని అడ్డగించారు. ఆ తరువాత కారు డ్రైవర్ ని తమ వద్ద ఉన్న తుపాకులు చూపించి బెదిరించి.. బయటికి రమ్మన్నారు. కారు డ్రైవర్ బయటకు రాగానే అతని తలపై బలంగా కొట్టి కారు తీసుకెళ్లిపోయారు. ఆ కారు డ్రైవర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయగానే పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ వాహనం అక్కడకు చేరుకొని.. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది.

Also Read: సొంత కొడుకునే దత్తత తీసుకునేందుకు అనుమతి కోరిన మహిళ.. సుప్రీం కోర్టులో విచిత్ర కేసు


పోలీసులు కారు దొంగతనం ఫిర్యాదు నమోదు చేసుకొని.. కారులోని జిపిఎస్ ఆధారంగా ట్రాక్ చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం కారుని ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని.. కారుని సీజ్ చేశారు. ఆ తరువాత ఆ ఇంటి ఓనర్.. మాజీ పోలీస్ ఆఫీసర్ విజయ్ కుమార్ అని తెలియడంతో వారు ఆశ్చర్యపోయారు. దీంతో దొంగలను పట్టుకోవడానికి విచారణ చేయగా.. కారు దొంగతనం చేసిన ముగ్గురిలో ఇద్దరు ఆయన కుమారులే అని తెలిసింది.

దీంతో పోలీసులు ఆఫీసర్ విజయ్ కుమార్ ఇద్దరు కొడుకులు వికాస్ శర్మ, దీపక్ శర్మతో పాటు వారి స్నేహితుడు అమన్ చావ్లాని కూడా అరెస్టు చేశారు.

Also Read: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×