BigTV English

Satya Sai district: జుట్టు కత్తిరించి.. వివస్త్రను చేసి.. ప్రేమజంటకు సహకరించిందని మహిళపై పైశాచిక దాడి!

Satya Sai district: జుట్టు కత్తిరించి.. వివస్త్రను చేసి..  ప్రేమజంటకు సహకరించిందని మహిళపై పైశాచిక దాడి!

Satya Sai district Crime News: ఏపీలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళ జుట్టును కత్తిరించి, వివస్త్రను చేసి పైశాచికంగా దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ప్రేమ జంటకు సహకరించిందనే అనుమానంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మహిళ ఇంటిపై మూకుమ్మడి దాడి  

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మునిమడుగులో రీసెంట్ గా ఓ ప్రేమ జంట ఇల్లు వదలి పారిపోయారు. వాళ్లు పారిపోయేందుకు  అదే ఊరికి చెందిన బోయ వెంకటలక్ష్మి సహకరించిందని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులతో పాటు దాదాపు 20 మంది ఆమె ఇంటిపై దాడి చేశారు. వెంకటలక్ష్మి చీర లాగి, జుట్టు కత్తిరించి పైశాచిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కియా ఇండస్ట్రియల్ పీఎస్ పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. బాధితురాలిని చికిత్స కోసం పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Read Also: సంక్రాంతికి ఊరెళ్లిన వారే టార్గెట్, ఏపీ, తెలంగాణలో పలు ఇండ్లను ఊడ్చేసిన దొంగలు!

మునిమడుగులో పోలీస్ పికెటింగ్

ఈ ఘటన పెనుకొండ మండలంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు టీడీపీ, వైసీపీ మధ్య పగలు రేపే అవకాశం ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మునిమడుగులో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ఊరికి రెండు వైపుల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కేసును డీఎస్పీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారు బాధిత మహిళకు బంధువులే అవుతారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న వాళ్లంతా మహిళలేనని వెల్లడించారు. మరోవైపు తన మీద దాడి చేసిన వాళ్లు వైసీపీకి చెందిన వాళ్లని బాధిత మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: గేదెల కోసం సీసీ పుటేజ్ వెతుకులాట.. ముగ్గురు దుర్మార్గుల అత్యాచారం సంగతి బట్టబయలు..

Read Also: పదో తరగతి అమ్మాయిల బట్టలు విప్పదీసిన ప్రిన్సిపాల్.. శిక్షపై మండిపడిన పేరేంట్స్

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×