Keerthy Suresh: సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చాలా అరుదు. చాలావరకు వారు ఇండస్ట్రీకి అస్సలు సంబంధం లేని వ్యక్తితో ప్రేమలో పడి, వారినే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి లిస్ట్‌లో ఇప్పుడు కీర్తి సురేశ్ కూడా యాడ్ అయ్యింది. గత 15 ఏళ్లుగా అసలు సినీ పరిశ్రమకే సంబంధం లేని ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నా కూడా అస్సలు బయటపడని కీర్తి.. తాజాగా తన బంధువులు, సన్నిహితులు మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని అందరికీ షాకిచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత తన భర్తతో కలిసి మొదటి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న కీర్తి.. పెళ్లి తర్వాత ఆంటోనీలో వచ్చిన మార్పుల గురించి బయటపెట్టింది.
అటెన్షన్ కొత్త
కీర్తి సురేశ్ పెళ్లి చేసుకునేంత వరకు అసలు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) ఎవరు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. తన సోషల్ మీడియాలో కూడా ఆంటోనీకి సంబంధించిన ఫోటోలు అస్సలే లేవు. అలా ఎందుకు అని అడగగా ఆంటోనీ చాలా ప్రైవేట్ పర్సన్ అని, తన గురించి అందరికీ తెలియడం తనకు నచ్చదని చెప్పుకొచ్చింది. కానీ కీర్తిలాంటి హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పటినుండి ఆంటోనీపై ప్రేక్షకుల అటెన్షన్ ఉండడం ఖాయం. ఆ విషయంపై కూడా కీర్తి సురేశ్ నోరువిప్పింది. భార్యాభర్తలుగా మారిన తర్వాత తమ రిలేషన్‌షిప్ ఎలా మారిందో చెప్పుకొచ్చింది.
మాకేం మారలేదు
‘‘నిజం చెప్పాలంటే పెద్దగా ఏమీ మారలేదు. మా ఇద్దరికీ చాలావరకు అంతా ఒకేలాగా ఉంది. కానీ మా ఇద్దరికీ చాలా అటెన్షన్ వస్తోంది. నాకు ఇదంతా అలవాటే, కానీ ఆంటోనీకి ఇంత అటెన్షన్ ఎప్పుడూ అలవాటు లేదు. కాబట్టి తనకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. నాకు కూడా మామూలుగా ఉన్నదానికంటే ఎక్కువ అటెన్షనే లభిస్తోంది. పెళ్లితో రెండు కుటుంబాలు కూడా ఏకమవుతాయి. అదే రిలేషన్‌షిప్‌ను డిఫరెంట్‌గా మారుస్తుంది. మేము చాలాకాలం కలిసున్నాం కాబట్టి మా మధ్య ఏమీ మారలేదు. కానీ పెళ్లి తర్వాత మా కుటుంబాలు కలవడం, మాట్లాడుకోవడం ఇదంతా చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అంటూ పెళ్లి తర్వాత జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది కీర్తి సురేశ్.
Also Read: క్యారవాన్ల గుట్టు రట్టు చేసిన నిత్యామీనన్..!
ఫ్యామిలీ టైమ్
‘‘మా పెళ్లి తర్వాత ఇదే మొదటి సంక్రాంతి. అందుకే ఇది మాకు మరింత స్పెషల్. పెళ్లి తర్వాత మేము మొదట సెలబ్రేట్ చేసుకునే పండగను తల అంటారు. కాబట్టి ఇది మాకు తల పొంగల్. పెళ్లి తర్వాత తన ఫ్యామిలీతో కలిసి మొదటిసారి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు సంక్రాంతి కోసం త్రివేంద్రంలోని మా ఇంటికి వెళ్లాం. కాబట్టి ఇది నాకు మరింత స్పెషల్. ఇది మాకు పూర్తిగా ఫ్యామిలీ టైమ్’’ అని చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్ (Keerthy Suresh). పెళ్లి తర్వాత భర్తతో సమయాన్ని గడపడం కోసం కొన్నాళ్ల పాటు కీర్తి సినిమాలకు బ్రేక్ ఇస్తుందని రూమర్స్ వచ్చినా అవేమీ నిజాలు కాదని క్లారిటీ ఇచ్చేసింది.