Medak District Crime : కొన్ని ఘటనలు తెలిస్తే చాలా బాధేస్తుంటుంది. మనం ఇంకా ఏ కాలంలో, ఎలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నామనే డౌట్ వస్తుంది. ఇలాంటి.. బతుకులు బతికితే ఎంత, చస్తే ఎంతా అనిపిస్తాయి. ఎందుకంటే.. మానవులుగా మనకి అవి తగిన పనులు కావనిపిస్తాయి కాబట్టి. అలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకుని పోలీసులు సైతం దిగ్భ్రాంతి చెందగా, సామాన్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాంటి అమానవీయ విషయం.. అనుకోకుండా వెలుగులోకి రావడమే విధి అనిపించక మానదు.
ఇటీవల మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ కు చెందిన ఓ రైతు తన గేదెలు కనిపించడం లోదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుటుంబ పోషణకు ఆధారమైన గేదెల ఆచూకీ ఎలాగైనా కనిపెట్టండి అంటూ స్థానిక పోలీసు స్టేషన్ కి వెళ్లాడు. పాపం రైతు.. సాయం చేద్దామని వెళ్లిన పోలీసులు, గేదెలు ఎటువైపు వెళ్లాయో తెలుసుకుందామని స్థానికంగా ఉన్న ఓ షాపు సీసీ టీవీ పుటేజ్ ను పరిశీలించారు. అప్పడే.. వారికి ఓ విషయం తెలిసింది. ఆ వీడియోలో.. గేదెల కోసం వెతకగా ఓ మూడు మానవ మృగాలు కనిపించాయి. వారు చేసిన పనికి.. పోలీసులు చలించిపోయి.. ఆగమేఘాలపై స్పందించి.. చర్యలకు దిగారు.
ఏం జరిగిందంటే..
గేదెల కోసం సీసీ టీవీ కెమెరా పుటేజ్(CC tv footage) పరిశీలిస్తుండగా.. జనవరి 8వ తేదీ తెల్లవారుజామున ఓ అమానవీయ ఘటనను గుర్తించినట్లు చేగుంట(Chegunta) ఎస్సై చైతన్య రెడ్డి తెలిపారు. ఈ రోజు తెల్లవారు జామున రామంతాపూర్ వద్ద 44వ జాతీయ రహదారి పక్కన మానసిక స్థితి సరిగా లేని ఓ యువతి (30) నిల్చుని ఉంది. ఆ సమయంలో అటుగా కోళ్ల వ్యానులో వచ్చిన ఓ ముగ్గురు వ్యక్తులు.. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించారు. ఆమె పరిస్థితిని అదనుగా చేసుకుని యువతిని పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహం వెనక్కు లాక్కెళ్లారు. ముగ్గురూ.. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాపం.. ఏమి తెలియని ఆ యువతిపై అమానవీయంగా హత్యాచారం చేసిన దుండగులు.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా.. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారిని తూప్రాన్‌కు చెందిన సయ్యద్ అఫ్రోజ్, చేగుంటకు చెందిన గౌరి బస్వరాజ్, బిహార్‌కు చెందిన ఎండీ సోహెల్‌లు గా గుర్తించారు. వీరిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధిత యువతిని గుర్తించి మెదక్ భరోసా కేంద్రానికి తరలించారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. జిల్లాలో చర్చనీయాంశమైంది. గేదెల కోసం వెతుకుతుంటే.. మానవ మృగాలు కళ్లబడ్డాయని ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి వ్యక్తలపై కఠినంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వారిని వదిలిపెట్టవద్దని కోరుతున్నారు. ఈ సంఘటనలో బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని, అమాయకులు, బలహీనుల భద్రతకు చర్యలు తీసుకోవాలంటూ.. స్థానికులు పెద్ద ఎత్తున నిరనసలు తెలిపారు. విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ ఇలాంటి నేరాలు జరగకుండా జాగ్రత్తలు పడతామని, వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
Also Read : ఒకే ఏటీఎంలో మూడుసార్లు చోరీ.. ఈసారి దోచింది ఎంతంటే?
కాగా.. ఈ ఘటనలో బాధితురాలిని పొరుగు జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమెపై అత్యాచారం విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపిన పోలీసులు.. భరోసా కేంద్రానికి తరలించారు. ప్రాథమిక విచారణలో ఆమె మానసిక సమస్యల కారణంగా ఇంట్లో నుంచి తప్పిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.