Thief Kisses Woman | తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించే దొంగలు.. ఇదే అదునుగా.. ఆ ఇళ్లలో దొంగతనాలు చేస్తుంటారు. అలాంటి ఐడియాతో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ఒక చోరుడు అనుకోని పనిచేశాడు. ఆ ఇంట్లో నివసించే మహిళకు మద్దు పెట్టి పారిపోయాడు. కానీ పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని మలాడ్ భాగం కురార్ ప్రాంతంలో జనవరి 3, 2025న ఒక ఇంట్లో ఎవరూ లేరని భావించి ఒక దొంగ ప్రవేశించాడు. అయితే ఇంట్లో ఏదైనా ఖరీదైన వస్తువులు దొంగలించాలని వెళ్లిన ఆ దొంగకు నిరాశే ఎదురైంది. ఆ ఇంట్లో అంతా ఖాళీగానే ఉంది. ఖరీదైన వస్తువులు ఏమీ లేవు. ఇంటి పరిసరాలన్నీ వెతికినా అతనికి తీసుకెళ్లడానికి ఏమీ దొరకలేదు.
ఇక ఖాళీ చేతులతోనే వెనుదిరగాల్సి వస్తుందని నిరాశగా ఉన్నాడు. అయితే అంతలో ఆ ఇంట్లో నివసించే యువతి అక్కడికి వచ్చేసింది. ఆమె రాకతో అక్కడే ఉండిపోయిన ఆ దొంగ.. ఆ యువతి అందంగా ఉండడంతో చేయకూడని పనిచేసేశాడు. అవకాశం చూసి పారిపోవాల్సి ఉండగా.. ధైర్యంగా వెనుక నుంచి ఆమెను పట్టుకొని ముద్దుపెట్టుకున్నాడు. దీంతో ఆమె షాక్ కు గురైంది. ఒక్కసారిగా తనను ఎవరో వెనుక నుంచి పట్టుకోవడంతో ఆమె గుండె ఆగినంత పనైంది. ఆమెను మద్దుపెట్టుకున్న తరువాత ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. అంతవరకు షాక్ లో ఉన్న ఆ యువతి ఒక్కసారిగా కేకలు వేసింది.
Also Read: న్యూ ఇయర్ పార్టీ కోసం పబ్ వింత ఏర్పాట్లు.. కస్టమర్లకు కండోమ్, ఓఆర్ఎస్ ప్యాకెట్ల కానుకలు..
ఇరుగుపొరుగు వచ్చేసరికే ఆ దొంగ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ సంఘటన తరువాత ఆ యువతి మలాడ్ కురార్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు షాకయ్యారు. ఆ తరువాత సిసిటీవి వీడియోల ఆధారంగా దొంగను గుర్తించారు. ఆ దొంగ ఇంతకు ముందు కూడా దొంగతనాల కేసులో జైలు కెళ్లిన రికార్డులు ఉండడంతో పోలీసులు అతడిని గాలించి పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
యువతి ఇంట్లో అనుమతి లేకుండా ప్రవేశించి ఆమెను భయపెట్టి ముద్దాడినందుకు గాను ఈ కేసులో పోలీసులు దొంగపై చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు.