BigTV English

Akaay Kohli: విరుష్క దంపతుల పిల్లల ఫోటోలు వైరల్.. ఎలా ఉన్నారో చూడండి!

Akaay Kohli: విరుష్క దంపతుల పిల్లల ఫోటోలు వైరల్.. ఎలా ఉన్నారో చూడండి!

Akaay Kohli: చాలామంది పాపులర్ సెలబ్రిటీస్, క్రీడాకారులు, సినీ తారలు, రాజకీయ నేతలు ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు ఎక్కువగా దైవదర్శనాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. వైఫల్యాలనుండి బయటపడేందుకు, మానసికంగా వారిని వారు మెరుగుపరుచుకునేందుకు ఆధ్యాత్మిక ప్రాంతాలకు, లేదా దైవదర్శనాలు చేస్తుంటారు. ఇందుకు భారత జట్టు క్రికెటర్లు కూడా మిరహాయింపు కాదు. వారు కూడా వైఫల్యాల్లో ఉన్నప్పుడు తమని తాము రిఫ్రెష్ చేసుకునేందుకు ఇలాంటివి చేస్తుంటారు.


Also Read: New Zealand Squad: ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే న్యూజిలాండ్ జట్టు ఇదే..కేన్ మామ వచ్చేశాడు!

అయితే భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇటీవల ఓ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ భారత్ లో అడుగుపెట్టిన తర్వాత తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ తో కలిసి ఉత్తరాప్రదేశ్ లోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జి మహారాజ్ ని కుటుంబ సమేతంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు.


అనంతరం స్వామీజీతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో అనుష్క ప్రేమానంద్ మహారాజ్ తో మాట్లాడుతూ.. ” మేము గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మా మనసులో కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు వేరే వాళ్లు అడిగేశారు. అయితే ఈసారి వచ్చినప్పుడు వేరే వాళ్ళ వల్ల నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇప్పుడు మాకు కేవలం మీ ఆశీస్సులు ఉంటే చాలు” అని పేర్కొంది.

అనంతరం స్వామీజీ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించారు. కోహ్లీ తన ఆటతో దేశం మొత్తానికి సంతోషాన్ని పంచాడని.. అతడు గెలిస్తే దేశం అంతా సంతోషంగా ఉంటుందన్నారు. అతడిని ప్రజలు అంతలా ప్రేమిస్తున్నారని పేర్కొన్నారు. ఇక కోహ్లీ తన పిల్లలను మీడియాకి దూరంగా, స్వేచ్ఛగా పెంచాలనుకుంటున్నాడన్న విషయం తెలిసిందే.

అందుకే తన పిల్లల గోప్యత విషయంలో విరాట్ కోహ్లీ చాలా జాగ్రత్తగా ఉంటాడు. సోషల్ మీడియాలో వారి పిల్లల ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు ముఖాలు కనిపించకుండా ఇమోజీలు ఉంచుతాడు. అయితే ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ థామ్ లో ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జి మహారాజ్ ని సందర్శించి వెళుతున్నప్పుడు విరాట్ కోహ్లీ – అనుష్క దంపతుల పిల్లల ముఖాలు రివీల్ అయ్యాయి.

Also Read: Gilchrist on Rohit Sharma: రోహిత్‌ ఇక చాలు…ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో…!

లోపలికి వెళుతుండగా కూతురు వామిక ముఖం, బయటికి తిరిగి వచ్చేటప్పుడు అకాయ్ ని అనుష్క ఎత్తుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, వారికి గొడుగులు అడ్డంగా పెట్టినప్పటికీ అకాయ్ ముఖం పర్ఫెక్ట్ గా ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించారు. దీంతో విరుష్క దంపతుల పిల్లల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

 

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×