Anantapur Incident: ప్రస్తుత సమాజంలో వావి, వరుసలు లేకుండా పోతుంది. నీచమైన కిచకులు వరుసలు మరిచిపోయి ప్రవర్థిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నాం అనే ఆలోచన లేకుండా పోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పెనుగొండలోని అమ్మవారిపల్లికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి తన అన్న కూతురిని లైంగికంగా వేధించాడు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనలో వెంకటరెడ్డి తన బంధువైన తన అన్న కూతురికి వాట్సాప్ ద్వారా ప్రైవెట్ ఫోటోలు పెట్టి, అసభ్యకరమైన మేసేజ్‌లు చేశాడు. అంతేకాకుండా కాల్స్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఆరోపణలు చేసింది. అయితే ఈ వేధింపులు అర్థరాత్రి సమయంలో జరిగాయని, యువతి ఈ అనుచిత ప్రవర్తనను తట్టుకోలేక కియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని సమాచారం ఇచ్చారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే వెంకటరెడ్డి, యువతి ఫోన్ నంబర్‌ను బంధువులా ద్వారా పొంది, ఆమెను వేధించేందుకు ఉపయోగించాడు. అతను తన ప్రైవేట్ పార్ట్‌ల ఫోటోలను యువతికి పంపడం, అశ్లీల సందేశాలతో ఆమెను ఇబ్బంది పెట్టడం చేశాడు. “పిన్ని ఊరికి వెళ్ళింది” అంటూ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు తెలిసింది. ఈ ఘటన యువతికి తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించింది, దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంకటరెడ్డిని అరెస్టు చేసేందుకు గాలింపు చేపట్టారు, అయితే అతను పరారీలో ఉన్నట్లు సమాచారం.
Also Read: నైరుతి ఎఫెక్ట్..! ముంచుకొస్తున్న మహా ప్రళయం.. భారత్ అంతమే?
ఇప్పుడు జరిగిన ఈ సంఘటన స్థానిక సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.. ఎందుకంటే బంధుత్వం పేరుతో ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేయడం సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, నిందితుడిని పట్టుకుని అతడిని కఠినంగా శిక్షించాలని బంధువులు కోరారు.