Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో.. ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం.. అందరినీ కలిచివేస్తోంది. యువతిపై దాడి తర్వాత ప్రేమోన్మాది కూడా కత్తితో పొడుచుకున్నాడు. నిందితుడు ప్రవీణ్ కొన ఊపిరితో.. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు.
ప్రేమలో పెరిగిన విభేదాలు, విషాదాంతం
బండ్లగూడలోని బాలాజీనగర్‌కు చెందిన ప్రవీణ్, రమ్య.. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకున్న ఇద్దరు ఈ సంబంధాన్ని పెళ్లివరకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవల వాళ్ల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. ఈ ఘాతుకం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
కత్తితో దాడి – వెంటనే మృతి చెందిన రమ్య
సోమవారం ఉదయం, ప్రవీణ్ రమ్య ఇంటికి వచ్చాడు. ఆ ఇద్దరి మధ్య కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత.. వెంటనే కత్తితో దాడి చేశాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రవీణ్ దాడిలో తీవ్రంగా గాయపడిన రమ్య.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్
తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను స్థానికులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు మృతి చెందిన రమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణ కొనసాగుతుంది
ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్–రమ్య మధ్య ఇటీవల ఏవైనా గొడవలు జరిగాయా? వేరే ఏమైనా కారణాలా? అనే అంశాలపై విచారిస్తున్నారు. ఇద్దరి ఫోన్ కాల్ రికార్డులు, మెసేజ్ లు, వారి స్నేహితుల వద్ద నుంచి సమాచారం సేకరిస్తున్నారు. రమ్య కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకుని కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగింది? రమ్యపై.. ప్రవీణ్ ఎందుకు కత్తితో దాడి చేశాడు? ఎందుకు ఆమె హత్య చేయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
న్యాయం కోసం కుటుంబ సభ్యుల డిమాండ్
తన కూతురును కత్తితో గొంతు కోసి చంపింది ప్రవీణేనని రమ్య తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గొడవలు జరిగినప్పటికీ.. ఇలా చేస్తాడని ఊహించలేదని అన్నారు. ఒక్కగానొక కూతురును పొట్టన పెట్టుకున్నాడని విలపించారు. ప్రవీణ్ కోలుకున్న వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రమ్య హత్యతో షాకయ్యమంటున్న స్థానికులు
రమ్య హత్య సంఘటన తమను షాక్ గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన విషయం తమకు తెలియదన్నారు. రమ్య పేరెంట్స్ వచ్చే వరకు కూడా తమ ఈ విషయం తెలియదంటున్నారు.
Also Read: తెలివి ఉండే నా తల రాత రాశావా? దేవుడికి లెటర్ రాసి.. యువకుడు అలాంటి పని..
ప్రేమ వ్యవహారం తెలియదన్న రమ్య కజిన్ సిస్టర్
తన సోదరికి ప్రేమ వ్యవహారం ఉన్నట్టే తమకు తెలియదని రమ్య కజిన్ సిస్టర్ చెప్పారు. ఎంతో అప్యాయంగా ఉండే తమకు ఈ సంఘటన ఓ షాకింగ్‌గా ఉందని చెప్పింది.