Ongole Accidents: ప్రకాశం జిల్లాలో ఒకే రోజు మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ట్రాఫిక్‌కు ఎలాంటి సమస్యలు లేకుండా డ్యామేజైన వాహనాలను పక్కకు తొలగించారు పోలీసులు. ఒకే రోజు జిల్లాలో మూడు ప్రమాదాలు ఎలా జరిగాయి? ఎక్కడెక్కడ, ఎలా జరిగాయి. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
ఒంగోలు మండలం సంఘ మిత్ర వైద్యశాల సమీపంలో కోడిగుడ్ల లోడుతో లారీ వెళ్తోంది. ఏం జరిగిందో తెలీదుగానీ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. రోడ్డుపై కోడిగుడ్లు చిందర వందరగా పడిపోయాయి. బోల్తాపడిన లారీ, మరొక వాహనాన్ని ఢీ కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని హైవే అంబులెన్స్ లో జిజిహెచ్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను పక్కకకు తొలగించారు. ఆ రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలకు లైన్ క్లియర్ చేయడంతో ట్రాఫిక్ సమస్య కాస్త సద్దు మణిగింది. దానికి కొంచెం ముందు ట్రాక్టర్ కారు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
ఒంగోలులోని కొప్పోలు ప్లైఓవర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న కారుని బలంగా ఢీకొట్టింది వెనుకనుంచి వస్తున్న లారీ. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లో మృతి చెందారు. అందులో మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. లారీ వేగానికి కారు నుజ్జు నుజ్జు అయ్యింది. గాయపడినవారిని సమపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు పోలీసులు.
ALSO READ: ప్రేమ.. ఆపై పెళ్లి, చివరకు చంపేశాడు, ట్విస్టు ఏంటంటే..