BigTV English

HIT 3 Collections : దుమ్ము దులిపేస్తున్న నాని మూవీ..ఎన్ని కోట్లంటే..?

HIT 3 Collections : దుమ్ము దులిపేస్తున్న నాని మూవీ..ఎన్ని కోట్లంటే..?

HIT 3 Collections : టాలీవుడ్ హీరో నాని ఇటీవల నటించిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ అవుతున్నాయి. హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఈ ఏడాది మొదటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 3 మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చేసింది. మే 1 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజున ఏకంగా 43 కోట్లు వసూల్ చేస్తే.. రెండో రోజు మరో 23 కోట్లు రాబట్టింది. దాంతో రెండు రోజులకు 66 కోట్లు వరకు వసూల్ చేసింది. ఇక మూడు రోజులకు ఎంత రాబాట్టిందో ఒక్కసారి చూసేద్దాం..


హిట్ 3 స్టోరీ విషయానికొస్తే..

ఈ మూవీ స్టోరీ మొత్తం మర్డర్ మిస్టరీలాగా సాగుతుంది. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. అర్జున్ సర్కార్ (నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదేతరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనక ఓ పెద్ద నెట్‌వర్క్ ఉందని అర్జున్‌ తెలుసుకుంటాడు. దాన్ని ఛేదించేందుకు నాని ఎం చేశాడు ? వరుస హత్యల వెనక కారణం ఏంటి ? అనేది ఈ మూవీ స్టోరీ.. అనేక ట్విస్ట్ లతో పాటు యాక్షన్స్ అన్ని విషయాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..


బిజినెస్ చూస్తే..

హిట్ 3 మూవీ రూ.48 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే ఈ సినిమా రూ.20.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.38.5 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.28.83 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. మొత్తానికి మూవీ అయితే 50 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. కేవలం రెండు రోజులకే కలెక్షన్ల వర్షం కురిపించింది..

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. సూపర్ హిట్ చిత్రాలే.. డోంట్ మిస్..

Hit 3 మూడు రోజుల కలెక్షన్స్..

మొదటి రోజునే 43 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరులో కొనసాగించిందని తెలుస్తుంది. 23 కోట్లు వసూల్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. టోటల్ 66 కోట్లు వసూల్ చెయ్యగా.. మూడో రోజు కూడా ఏ మాత్రం తగ్గలేదు. 85 కోట్లు వసూల్ అయ్యాయాని తెలుస్తుంది.. మరి మూడు రోజులకు ఈ మూవీ ఎంత వసూలు చేసిందో అధికారక ప్రకటన రావాల్సిందే. మొత్తానికి హీరో నాని ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×