BigTV English

Karivepaku oil: జుట్టు రాలడం త్వరగా తగ్గాలా? అయితే కరివేపాకు నూనె ఇలా ఇంట్లో చేసుకొని వాడండి

Karivepaku oil: జుట్టు రాలడం త్వరగా తగ్గాలా? అయితే కరివేపాకు నూనె ఇలా ఇంట్లో చేసుకొని వాడండి

కరివేపాకులు చాలా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తాయి. కానీ దీనిలో ఉండే పోషకాలు మాత్రం ఎంతో ఎక్కువ. యాంటీ మైక్రో బయల్ లక్షణాలు దీనిలో అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. కరివేపాకులో ఉండే బీటా కెరాటిన్, ఆల్కలాయిడ్లు, ప్రోటీన్లు వంటివన్నీ కూడా జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి.


చర్మం జుట్టు సంరక్షణలో కరివేపాకు ముందుంటుంది. కరివేపాకులో జుట్టు పెరుగుదల ప్రోత్సహించి దాని ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు సహజంగానే ఉంటాయి. కాబట్టి జుట్టు రాలడాన్ని ఆపడానికి ఇంట్లోనే కరివేపాకు నూనెను తయారు చేసుకోండి. దీని చేయడం చాలా సులభం.

కరివేపాకు నూనె తయారీ
కరివేపాకు నూనె తయారు చేయడానికి కొబ్బరి నూనె ఒక కప్పు తీసుకోండి. అలాగే కరివేపాకులు 50 గ్రాములు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఉసిరికాయలను ఒక నాలుగు తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టండి. అలాగే మెంతులు ఒక స్పూను తీసుకోండి. స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టి అందులో కొబ్బరి నూనెను వెయ్యండి. ఆ కొబ్బరి నూనెలోనే సన్నగా తరిగిన ఉసిరికాయలను, కరివేపాకులను, మెంతి గింజలను వేసి చిన్న మంట మీద బాగా వేయించండి.


వాటిల్లో ఉండే తేమ అంతా పోతుంది. చివరికి లేత గోధుమ రంగులోకి మారడం కనిపిస్తుంది. ఆ సమయంలో మంటని ఆపివేయండి. అలా ఆ గిన్నెలోనే నూనెను వదిలేయండి. మరుసటి రోజు ఆ నూనెను వడకట్టి ఒక డబ్బాలో వేసుకోండి. వారానికి ఒకటి రెండు సార్లు ఈ నూనెను వాడుతూ ఉండండి. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

ఉసిరిపొడితో కరివేపాకు నూనె
కరివేపాకు నూనె తయారు చేయడానికి మరో పద్ధతి కూడా ఉంది. ఇందుకోసం మీరు ఎండిన ఉసిరి పొడిని తీసుకోవాలి. అలాగే నువ్వులు, ఆలివ్ నూనె, కరివేపాకులు కూడా అవసరం పడతాయి. కొబ్బరి నూనెను తీసుకోవాలి. అది కూడా కోల్డ్ ప్రెస్డ్ నూనె ఎంపిక చేసుకోవాలి. అంటే శుద్ధి చేయని కొబ్బరి నూనె వాడితే మంచిది. ఇప్పుడు కొబ్బరి నూనెలో కొన్ని నువ్వులు, కరివేపాకులు, ఎండిన ఉసిరి పొడి, కొంత ఆలివ్ నూనె, ఒక స్పూను మెంతి గింజలు వేసి అలా వదిలేయండి. ఒక రోజంతా అలా వదిలేసాక కొబ్బరి నూనెతో సహా ఈ మూలికలు అన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి.

తర్వాత ఆ పేస్టుని ఒక వస్త్రంలో వేసి బాగా పిండండి. అప్పుడు అందులో నుంచి వచ్చిన నూనెను ఒక డబ్బాలో వేసి దాచుకోండి. దీన్ని వారానికి రెండు సార్లు వాడితే ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు రాలడం చాలా వరకు ఆగి పెరగడం మొదలవుతుంది.

జుట్టు అంతగా పెరిగితేనే ఎవరైనా ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ రసాయనాలతో కూడిన ఉత్పత్తులను ఉపయోగిస్తే కొన్ని రోజులకు జుట్టు రాలిపోయే సమస్య పెరుగుతుంది. కాబట్టి మీరు ఇంట్లోనే ఇలా కరివేపాకు నూనెను తయారు చేసుకొని వాడుతూ ఉంటే పొడవైన, బలమైన జుట్టు కచ్చితంగా పెరుగుతుంది.

Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×