Stray Dog: జమ్మిచెడులో 15 మందిపై పిచ్చికుక్క దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. గద్వాలలో 15 రోజుల క్రిందట పిచ్చికుక్క దాడి చేసి 20 మందిని గాయపరచిన ఘటన మరువక ముందే మరోసారి పిచ్చికుక్క దాడి చేసింది. మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు డియమాండ్ చేస్తున్నారు.
Also read: యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయర్ అరెస్ట్ ?
గద్వాల్ పట్టణంలోని జమ్మిచెడులో (4వ, 5వ,వార్డ్ లో) 15 మంది పై దాడి చేసి పిచ్చి కుక్క గాయపరిచింది. గాయపడిన వారిని మహబూబ్ నగర్, గద్వాల ఆసుపత్రికి తరలించారు. కుక్క కోసం గాలింపు చేపట్టారు. గద్వాల జిల్లా కేంద్రంలో 15 రోజుల క్రిందట నల్లకుంట, కృష్ణవేణి చౌక్, గంజిపేటలో 20 మందిని పిచ్చికుక్క కరిచిన సంఘటన మరువకముందే మరోసారి మంగళవారం జమ్మిచెడులో 15 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచిన విషయంలో మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా సమీపంలోని మేళ్లచెరువు గ్రామంలో పిచ్చికుక్క ను గుర్తించి దాడి చేయడంతో మరణించిందని ప్రచారం నడుస్తోంది.
Also read: జియో సంచలనం.. రూ.800 లోపే లైవ్ లొకేషన్ ట్రాకింగ్, యూపీఐ పేమెంట్స్ ఉన్న 4G ఫోన్!