E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?
Advertisement

Abishek Porel accused of cohabitation:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League tournament) మొన్నటి వరకు అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అభిషేక్ పోరెల్ ( Abishek Porel) సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన కేసులో అడ్డంగా దొరికిపోయాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కర్ణాటక కు సంబంధించిన యువతితో సహజీవనం ( Abishek Porel accused of cohabitation) కూడా చేశాడట అభిషేక్ పోరెల్. అయితే సహజీవనం చేసిన అతడు.. ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అభిషేక్ పోరెల్ పై హుగ్లీ జిల్లాలోని మాగ్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అంతేకాదు, అభిషేక్ పోరెల్ ను అరెస్ట్ చేయబోతున్న‌ట్లు వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.  దీంతో అభిషేక్ పోరెల్ ప్రమాదంలో పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు యాష్ దయాల్ అచ్చం ఇలాగే వివాదంలో చిక్కుకొని.. కెరీర్ నాశనం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఢిల్లీ ఆటగాడు అభిషేక్ పోరెల్ కూడా అమ్మాయి కేసులో ఇరుక్కొని.. అడ్డంగా బుక్ అయ్యాడు.

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

Advertisement

బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అభిషేక్ పోరెల్ ఓ అమ్మాయి వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కర్ణాటక కు సంబంధించిన యువతితో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో హుగ్లీ జిల్లాలోని మాగ్రా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిషేక్ పోరెల్ పేరు వైరల్ గా మారింది. అతడు చీటర్ అంటూ కొంతమంది దారుణంగా పోస్టులు కూడా పెడుతున్నారు. క్రికెట్ ఆడుతూ, సెలబ్రిటీగా మారిన పోరెల్.. ఇలా అమ్మాయిని వాడుకోవడం చాలా తప్పు అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అయితే పోలీస్ కేసు నమోదు అయినట్లు వస్తున్న వార్తలపై అభిషేక్ ( Abishek Porel accused of cohabitation)  స్పందించారు. తాను ఏ యువతిని మోసం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఫేక్ ప్రచారం అంటూ మండిపడ్డారు. దీన్ని కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్ పోరెల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆ జట్టులో వికెట్ కీపర్ గా ఆడుతూనే… ఇంపాక్ట్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

Advertisement

 

 

 

 

 

 

 

 

 

 

Related News

పాకిస్తాన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు త్రిముఖ వ్యూహాం..అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌

Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

బౌలర్లు భ‌య‌ప‌డుతున్నారు..వైభ‌వ్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఐసీసీ కొత్త రూల్స్ పెట్టాలి

Asghar Afghan: బాబర్ ఆజం కంటే గుర్బాజ్ 1000 రెట్లు బెస్ట్ ప్లేయ‌ర్, మా వాడిది కోహ్లీ రేంజ్

Tanveer Ahmed: వైభ‌వ్ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే, కంబ్యాక్ ఇవ్వ‌డం క‌ష్టం

మ‌రో వివాదంలో అశ్విన్‌…పాకిస్తాన్ ప్లేయ‌ర్ ప‌క్క‌న కూర్చోని ఫోటోలు

Big Stories

×