E-Paper
Advertisement

జియో సంచలనం.. రూ.800 లోపే లైవ్ లొకేషన్ ట్రాకింగ్, యూపీఐ పేమెంట్స్ ఉన్న 4G ఫోన్!

జియో సంచలనం.. రూ.800 లోపే లైవ్ లొకేషన్ ట్రాకింగ్, యూపీఐ పేమెంట్స్ ఉన్న 4G ఫోన్!
Advertisement

Jio Bharat V4: భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మరోసారి తెరలేపుతూ రిలయన్స్ జియో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టింది. సామాన్యులకు సైతం ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేవలం రూ.799కే ‘జియోభారత్ V4’ 4G ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికీ పాతకాలపు 2G నెట్‌వర్క్‌ను వాడుతున్న కోట్లాది మంది ప్రజలను 4G వైపు నడిపించేందుకు ఈ ఫోన్ ఎంతగానో ఉపయోగపడనుంది.

సామాన్యుడికి డిజిటల్ అండ:

స్మార్ట్‌ఫోన్ల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. తక్కువ బడ్జెట్‌లో కనెక్టివిటీని కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో దీనిని రూపొందించింది. మొదటిసారి ఇంటర్నెట్ వాడే వారికి కూడా అర్థమయ్యేలా దీనిని చాలా సులభంగా డిజైన్ చేశారు.

Advertisement

Also Read: సరికొత్త రికార్డ్.. అత్యంత సన్నని ఫోన్‌ను లాంచ్ చేసిన టెక్నో.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!

కుటుంబానికి రక్షణ.. సేఫ్టీ ఫస్ట్:

ఈ ఫోన్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రధాన అంశం ఇందులోని ‘సేఫ్టీ ఫస్ట్’ ఫీచర్. దీని ద్వారా కుటుంబ సభ్యుల లైవ్ లొకేషన్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ఆ ఫోన్‌లో యూసేజ్ మేనేజర్ సాయంతో మనకు నచ్చిన యాప్స్, కాంటాక్ట్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచుకోవచ్చు. ఇంట్లోని పిల్లలు, వృద్ధుల భద్రతకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

అరచేతిలో వినోదం:

Advertisement

తక్కువ ధరకే వస్తున్నప్పటికీ.. వినోదానికి దీనిలో ఎలాంటి కొరత లేదు. వినియోగదారులు జియోహాట్‌స్టార్ (JioHotstar) ద్వారా లైవ్ క్రికెట్, షోలను చూడవచ్చు. అలాగే జియోటీవీ (JioTV) సాయంతో 500 పైగా లైవ్ ఛానళ్లను వీక్షించవచ్చు. పాటల ప్రియుల కోసం జియోసావన్ (JioSaavn) యాప్ కూడా ఉంది. మెరుగైన ఆడియో క్వాలిటీతో పాటలు వినడం ఇప్పుడు మరింత సరదాగా మారనుంది.

సులువైన డిజిటల్ పేమెంట్స్:

ఈ ఫోన్‌లో జియోపే (JioPay) ద్వారా యూపీఐ (UPI) పేమెంట్స్ చేసుకునే సౌకర్యం ఉంది. క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి డబ్బులు పంపడం, తీసుకోవడం చాలా సులభం. ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఉపయోగపడేలా, డబ్బులు అకౌంట్‌లో పడగానే సౌండ్ అలర్ట్ వచ్చేలా దీనిని రూపొందించారు. ఈ జియోభారత్ V4 ఫోన్ బ్లూ, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. దీనిని జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అధికారిక జియో స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read: బడ్జెట్ ధరలో సూపర్ 5G ఫోన్లు.. కస్టమైజ్డ్ లైట్లతో ఆకట్టుకుంటున్న Ai+ Nova 2 Pro!

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×