BigTV English

Donald Trump: హమ్మయ్య, ట్రంప్ శాంతించినట్టే.. ఆ మూడు రంగాల్లో పన్నుబాదుడు ఇప్పట్లో లేనట్టే..

Donald Trump: హమ్మయ్య, ట్రంప్ శాంతించినట్టే.. ఆ మూడు రంగాల్లో పన్నుబాదుడు ఇప్పట్లో లేనట్టే..

ఏప్రిల్ 2 అంటేనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ప్రతీకార పన్నులతో చెలరేగిపోతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ గా పెట్టిన తేదీ అదే. ఏప్రిల్ 2న రెపిప్రోకల్ లెవీస్ (ప్రతి సుంకాలు) ప్రకటిస్తానంటూ ట్రంప్ ఫిబ్రవరిలో హింటిచ్చారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయంలో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మూడు రంగాల్లో నిర్దిష్ట సుంకాలను ప్రకటించడం వాయిదా వేస్తున్నట్టు వైట్ హౌస్ అధికార వర్గాల సమాచారం. ఆటో మొబైల్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్లు, ఫార్మాస్యుటికల్స్ రంగాలపై పన్నుల బాదుడు ఉండకపోవచ్చని తెలుస్తోంది.


నిర్దిష్ట సుంకం..
ఆటో మొబైల్, సెమీకండక్టర్స్, ఫార్మాస్యుటికల్ రంగాలపై సెక్టార్ స్పెసిఫిక్ టారిఫ్ లను అంటే ఆయారంగాలకు మాత్రమే పరిమితమయ్యే నిర్దిష్ట సుంకాలను విధించాలని ట్రంప్ ప్రతిపాదించారు. కానీ ఆ సుంకాలను ఏప్రిల్-2 న ప్రకటించే అవకాశం లేదు. ఆటో మొబైల్ రంగంలోని 3 దిగ్గజ కంపెనీల కోరిక మేరకు ఆ రంగంలో ప్రతి సుంకాలను విధించే విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. గతంలో ఆ మూడు రంగాల్లో 25శాతం వరకు సుంకాలను పెంచేందుకు ట్రంప్ నిర్ణయించారు. దీంతో ఆయా రంగాల్లో అలజడి మొదలైంది. భారీ సుంకాలతో వ్యాపారం దెబ్బతింటుందని కంపెనీలు భావించాయి. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయం మార్చుకుంటున్నట్టు తేలడంతో కాస్త ఊరట లభించినట్టయింది. అయితే దీన్ని ఎవరూ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోడానికి వీలు లేదు. అమెరికా అధ్యక్షుడికి తిక్కరేగితే ఏ క్షణం అయినా పన్ను రేట్లను ప్రకటించే అవకాశముంది.

సెక్టార్ స్పెసిఫిక్ టారిఫ్ లను మినహాయించాలని అనుకున్నా.. మిగతా రంగాల్లో రెసిప్రోకల్ లెవీస్ ని మాత్రం ఏప్రిల్-2న ట్రంప్ ప్రకటించే అవకాశముంది. పరస్పర సుంకాలను ప్రకటిస్తూనే ఆయారంగాల్లో కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధమయ్యారట. ఏదేమైనా ఏప్రిల్-2న మాత్రం ట్రంప్ సంచలన నిర్ణయాలను ప్రకటించబోతున్నారు.


రెసిప్రోకల్ లెవీస్ తో కష్టం..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిననాటినుంచీ పన్నుల బాదుడుపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ పన్నుల విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇన్నాళ్లూ పన్నుల రూపంలో అమెరికాను ఇతర దేశాలు దోచుకున్నాయని, తమ దేశానికి రావాల్సిన సొమ్ము రాకుండా పోయిందని ఆయన అంటున్నారు. దానికి తగిన ఆధారాలు కూడా చూపిస్తున్నారు ట్రంప్. ఇతర దేశాల వస్తువుల్ని తక్కువ దిగుమతి సుంకంతో అమెరికాలో డంప్ చేస్తున్నారు. అదే సమయంలో అమెరికా మాత్రం ఇతర దేశాలకు వస్తువుల్ని ఎగుమతి చేసే సమయంలో స్థానిక దేశాల నియమాలు పాటించాల్సి వస్తోంది. ఆయా దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటంతో అమెరికా సంస్థల లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయట. ఈ చరిత్రను తిరగరాస్తానంటున్నారు ట్రంప్. అంటే ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పెద్ద ఎత్తున పన్నుల భారం మోపబోతున్నాడనమాట. వ్యాపార భాగస్వామ్య దేశాలు తమ వస్తువులపై ఏ స్థాయిలో పన్నులు వసూలు చేస్తున్నాయో, అదే స్థాయిలో అమెరికా కూడా ఇకపై పన్నులు విధిస్తుందనమాట.

ఏప్రిల్ 2 అమెరికా దేశానికి విముక్తి కలిగించే రోజు అని ట్రంప్ గత ఫిబ్రవరిలో హింటిచ్చారు. ఇదివరకు అధికారంలో ఉన్న తెలివి తక్కువ అధ్యక్షులు అమెరికా సంపదను ఇతర దేశాలకు ఇస్తూ పోయారని, ప్రస్తుతం తాను విధించే సుంకాల ద్వారా అందులో కొంత భాగాన్ని తిరిగి పొందబోతున్నామని కూడా ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన పరమార్థం ప్రపంచ దేశాలకు ఏప్రిల్-2న అర్థం కాబోతోంది. అయితే ఆలోగా కొన్నిరంగాలపై మాత్రం ట్రంప్ కాస్త పెద్దమనసు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×